మయన్మార్ లో భూకంప దాటికి వేలాదిమంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. పెద్ద పెద్ద భవంతులు కూలిపోయి శిథిలాల కింద ఎంతోమంది చిక్కుకొని మరణించారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో గంట గంటకు మరణాల సంఖ్య పెరిగిపోతోంది. శుక్రవారం సంభవించిన ఈ భూకంపం వల్ల
తెలంగాణం, న్యూస్ లైన్ డెస్క్: మయన్మార్ లో భూకంప దాటికి వేలాదిమంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. పెద్ద పెద్ద భవంతులు కూలిపోయి శిథిలాల కింద ఎంతోమంది చిక్కుకొని మరణించారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో గంట గంటకు మరణాల సంఖ్య పెరిగిపోతోంది. శుక్రవారం సంభవించిన ఈ భూకంపం వల్ల ఇప్పటికే 694 మంది మరణించారు, 1670 మంది గాయపడ్డారు.
సహాయక చర్యలు కొనసాగుతున్నందున ఈ సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ నగరంలో నిర్మాణంలో ఉన్న ఎత్తైన భవనం కూలిపోయింది, 6గురు మరణించారు. సహాయక చర్యల కోసం అంతర్జాతీయ మద్దతు కోరుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. మయన్మార్‌లోని రెండవ అతిపెద్ద నగరమైన మాండలే సమీపంలో భూకంపం సంభవించింది. దాదాపు 11 నిమిషాల తర్వాత, బలమైన 6.4-మాగ్నిట్యూడ్ ఆఫ్టర్‌షాక్ వచ్చింది.
ఇంకా మరణాల సంఖ్య 1,000 దాటవచ్చని యుఎస్ జియోలాజికల్ సర్వే అంచనా వేసింది. మయన్మార్ యొక్క మిలిటరీ నాయకుడు జనరల్ మిన్ ఆంగ్ హ్లైంగ్, ఎంతోమంది మరణించవచ్చని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని శిథిలాల కింద ఎంతోమంది కొట్టుమిట్టాడుతున్నారని తెలియజేశారు. క్షతగాత్రులతో నేపిడా, మాండలే మరియు సాగింగ్‌లోని ఆసుపత్రులు నిండిపోయన్నారు. ఇతర దేశాల ప్రతినిధులంతా సహకారం అందించాలని మేజర్ జనరల్ జా మిన్ కోరారు.