Tattoo: టాటూ వేయించుకోవడం కాదు...రిస్క్ కూడా తీసుకోవాలి గురు !

ప్రధానంగా టాటూలతో చర్మ క్యాన్సర్ వచ్చే ముప్పు 137 శాతం పెరుగుతుందని, బ్లడ్ క్యాన్సర్ ముప్పు అయితే ఏకంగా 173 శాతం పెరుగుతుందని హెచ్చరించారు.


Published Mar 29, 2025 11:41:00 AM
postImages/2025-03-29/1743228746_7276.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: సరదా కోసమో ..ఇష్టంతోనో శరీరంపై టాటూలు వేయించుకుంటున్నారు. ఇప్పుడు టాటూ ట్రెండ్ కూడా ...అయితే టాటూ ఎంత పెద్దది ఉంటే ...క్యాన్సర్ రిస్క్ అంత ఎక్కువ. ఇది శాస్త్రవేత్తలు చెబుతున్న మాటలు. ఈ పరిశోధనలు కూడా దాదాపు 2వేల మందికి పైగా టాటూ వేయించుకున్న వారిపై చేశారు. అయితే వారిలో దాదాపు క్యాన్సర్ ముప్పు 62 శాతం ఎక్కువని తెలిపారు. ప్రధానంగా టాటూలతో చర్మ క్యాన్సర్ వచ్చే ముప్పు 137 శాతం పెరుగుతుందని, బ్లడ్ క్యాన్సర్ ముప్పు అయితే ఏకంగా 173 శాతం పెరుగుతుందని హెచ్చరించారు.


టాటూలో వేసే సిరా చర్మంలో చాలా కణాలతో కలిసినపుడు అయితే కణాల్లో ఇంక్ కలిసిపోవడం లేకపోతే ...అక్కడ చర్మం కుల్లిపోయి లోలోపల క్యాన్సర్ కణాలను వృధ్ధి చేయడం జరుగుతుంది. ఈ సిరాలోని కార్బన్ బ్లాక్ క్యాన్సర్ కారకమని ‘ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (ఐఏఆర్ సీ) వెల్లడించింది. శరీరంపై వేసుకున్న టాటూపై సూర్యరశ్మి పడినప్పుడు లేదా టాటూను తొలగించేందుకు లేజర్ చికిత్స తీసుకున్న సందర్భంలో ఆ టాటూ నుంచి అజో కాంపౌండ్స్ విడుదలవుతాయని పరిశోధకులు తెలిపారు. ఇది క్యాన్సర్ ముప్పును మరింత పెంచుతుంది. కాబట్టి టాటూ ఎప్పటికైనా స్కిన్ క్యాన్సర్ , బ్లడ్ క్యాన్సర్లకు దారి తీస్తుంది.

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu health cancer

Related Articles