రాజమౌళి - మహేష్ సినిమా మొదలైన దగ్గర నుంచి అసలు అప్డేట్స్ లేకుండా సైలెంట్ గా షూట్ చేస్తున్నారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా చేస్తున్నాడు. ఆ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఒడిశాలోని కోరాపుట్ ఫారస్ట్ లో రెండో షెడ్యూల్ పూర్తి చేసుకున్నారు. ఈ షెడ్యూల్ లో మహేష్ బాబు , ప్రియాంక చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్ పాల్గొన్నారు. షూట్ అయ్యాక వీరి ఫొటోలు కొన్ని లీక్ అయ్యాయి. రాజమౌళి - మహేష్ సినిమా మొదలైన దగ్గర నుంచి అసలు అప్డేట్స్ లేకుండా సైలెంట్ గా షూట్ చేస్తున్నారు.
అసలు రాజమౌళి సినిమా అంటే ఆ సినిమా హీరోలు లుక్ బయటకు రాదు మరో సినిమా ఏది ఒప్పుకోరు. యాడ్స్ చేయకూడదు. మరి మహేష్ బాబుకి మాత్రం ఎందుకో ఈ అవకాశం . సారు తెగ యాడ్స్ చేస్తున్నారు. మొన్నే కూతురుతో ఓ యాడ్ ..ఇప్పుడు మరో యాడ్ తో స్క్రీన్ మీద కనిపిస్తున్నారు. అప్పుడే రాజమౌళి సినిమా నుంచి మహేష్ ఫుల్ లుక్ లీక్ అయిందని ఫ్యాన్స్ బాధపడ్డారు.
అంతలోనే మహేష్ ..తమన్నాతో కలిసి ఓ ఏసీ కంపెనీకి యాడ్ ని రిలీజ్ చేశారు. ఇందులో కూడా మహేష్ రాజమౌళి సినిమా లుక్ లో నే కనిపించాడు.ఈ సినిమాకు మహేష్ లుక్స్ లీక్ అవ్వాల్సిన పని లేదు. మహేష్ యాడ్స్ తో ఆయనే లుక్స్ బయట పెడుతున్నాడు అని ఫ్యాన్స్ వాపోతున్నారు. ఇలా కాని జరిగితే...రాజమౌళి హైప్స్ కూడా మహేష్ ను కాపాడలేవని అంటున్నారు.