Nani: సరిపోదా శనివారం ట్రైలర్ రిలీజ్

మంగళవారం మూవీయూనిట్ ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్‌ను విడులద చేసింది.


Published Aug 13, 2024 08:42:19 PM
postImages/2024-08-13//1723561939_shanivaram.PNG

న్యూస్ లైన్ సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో నాని న‌టిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సరిపోదా శనివారం’. ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వ‌హిస్తుండగా.. నాని సరసన కోలీవుడ్ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‍గా న‌టిస్తోంది. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ మూవీ ఆగ‌ష్టు 29న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే మూవీ నుంచి విడుద‌ల చేసిన గ్లింప్స్‌ ప్రేక్షకుల నుంచి మంచి టాక్ తెచ్చుకుంది. మంగళవారం మూవీయూనిట్ ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్‌ను విడులద చేసింది.

ఈ ట్రైలర్‌‌లో నాని పక్కా మాస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. పోతారు.. మొత్తం పోతారు అంటూ నాని చెప్పే డైలాండ్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ట్రలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ సినిమాలో సాయికుమార్, ఎస్‌జే సూర్య  కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జేక్స్ బిజోయ్ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నాడు. ఇక‌ ‘అంటే సుందరానికి’ సినిమా తర్వాత నాని – వివేక్ కాంబో రిపీట్ అవుతుండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

newsline-whatsapp-channel
Tags : tollywood movie-news nani hero- saripada-shanivaram

Related Articles