హీరో నాగచైతన్య, సమంత విడాకులకు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కారణమని ఆమె చేసిన వ్యాఖ్యలు, అలాగే ఎన్ కన్వెన్షన్ సెంటర్‌కు సంబంధించిన ఆరోపణలు
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: సినీ ఇండస్ట్రీలో కొండా సురేఖ వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. సోషల్ మీడియాలో ఆరోపణలు వైరల్ కావడం, ముఖ్యంగా , పెద్ద దుమారానికి కారణమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై తెలుగు ఇండస్ట్రీ తో పాటు తమిళ ఇండస్ట్రీలు కూడా రియాక్ట్ అయ్యారు.
కొండా సురేఖపై లీగల్ యాక్షన్ తీసుకునేందుకు రంగం సిధ్దం చేసినట్లు తెలిపారు . ‘‘ప్రస్తుతం వైజాగ్‌లో ఉన్నా, హైదరాబాద్‌కు తిరిగి వచ్చాక లాయర్లతో చర్చలు జరిపి తదుపరి చర్యలు తీసుకుంటా’’ అన్నారట. తన కుటుంబ విషయాన్ని ఇలా పబ్లిక్ లో చర్చించినందుకు గాను చట్టపరమైన చర్యలు తప్పకుండా తీసుకుంటానని తెలిపారు. మేం దీన్ని వదిలే ప్రసక్తే లేదని తెలిపారు.
దీనికి గాను కొండా సురేఖ ట్విట్టర్ వేదికగా క్షమాపణలు చెప్పారు. ‘‘నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఉన్న చిన్నచూపును ప్రశ్నించడం మాత్రమే కానీ, సమంత లేదా ఆమె అభిమానులను బాధపెట్టడం కాదు. నా మాటల వల్ల ఎవరైనా మనస్తాపం చెందితే, నేను వాటిని ఉపసంహరించుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. అయితే, కేటీఆర్ విషయంలో మాత్రం ఆమె తన ఆరోపణలపై వెనక్కి తగ్గడం లేదని అన్నారు. అయితే నాగార్జున కాని ..నాగచైతన్య కాని ఎందుకు విడిపోతున్నారనో తెలపలేదు..అందుకే నాకు తెలిసిన విషయం బయటకు చెప్పేసానంటు సర్దిచెప్పుకున్నారు. దీంతో మరింత ఫైర్ అయ్యారు నాగార్జున . లీగల్ నోటీసులు పంపుతామని ..విషయాన్ని వదిలేసే ప్రసక్తే లేదని తెలిపారు.