Namibia:ఏనుగులను చంపుతాం ప్రజల కడుపు నింపుతాం.!

ప్రస్తుతం నమిబియా తీవ్రమైన కరువుతో పోరాడుతోంది. దాదాపుగా అక్కడ ఉండేటువంటి 14 లక్షల మందికి కనీసం తినడానికి తిండి లేదట. తిండిగింజల కరువు రావడంతో అక్కడ అడవి జంతువులను చంపి


Published Aug 29, 2024 02:35:10 PM
postImages/2024-08-29/1724922310_elephentmeet.jpg

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం నమిబియా తీవ్రమైన కరువుతో పోరాడుతోంది. దాదాపుగా అక్కడ ఉండేటువంటి 14 లక్షల మందికి కనీసం తినడానికి తిండి లేదట. తిండిగింజల కరువు రావడంతో అక్కడ అడవి జంతువులను చంపి వారికి మాంసం అందించాలని అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  దీనికోసం మొత్తం 723వన్య ప్రాణులను చంపి ఆ మాంసాన్ని నమీబియా సర్కార్ ప్రజలకు పంచనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రణాళికను కూడా  పర్యావరణ మంత్రిత్వ శాఖ రూపొందించిందట. అయితే ఈ విషయాన్ని నమీబియా  అధికారికంగా విడుదల చేయడంతో ప్రపంచవ్యాప్తంగా చర్చా నియాంశమైంది.

  ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం  దశాబ్దాల కాలం అత్యంత కరువును ఎదుర్కొంటుందట.  అయితే నమీబియాలో గత నెలలో అక్కడ ఆహార నిల్వలు 84% పడిపోయాయని, రాబోయే రోజుల్లో మరింత కరువు నెలకొని ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ కరువు నుంచి ప్రజల్ని బయటపడేసుకోవడం కోసం  అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులను చంపి మాంసం సరాఫరా చేయాలని చూస్తున్నారట.

 83 ఏనుగులు, 30 హిప్పోలు , 300 జీబ్రాలు, 50 ఇంపాలాలు,  60 గేదెలు, 100 బ్లూ వైల్డ్ బెస్ట్, 100 ఎలాండ్ లను చంపాలని ప్రభుత్వం అంచనా వేసిందట.  వృత్తిపరమైన వేటగాళ్లతో ప్రభుత్వం ఇప్పటికే ఒప్పందం చేసుకొని 723 జంతువులను 56,800 కిలో గ్రాముల కంటే ఎక్కువ మాంసం తీసుకురావాలని చూస్తున్నారట. ఈ విధంగా నమీబియాలో అడవి జంతువులను చంపి ప్రజలకు మాంసం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఇది కాస్త సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu namibiya elephenr-meet -drought- food-problum

Related Articles