Nani: 'నాని'యా మజాకా..సరికొత్త రికార్డ్ సాధించిన 'సరిపోదా శనివారం'.!

నాని టాలీవుడ్ లో  వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో. ఈయన ఎలాంటి పాత్రలో అయినా  ఈజీగా దూరిపోగలడు. కామెడీ పాత్ర అయినా సరే లవ్, ఎమోషన్ పండించే పాత్ర అయినా సరే,  ఫైటింగ్ సీన్స్ అయినా సరే 


Published Sep 08, 2024 02:51:35 PM
postImages/2024-09-08/1725787295_saripodasanivaaram.jpg

న్యూస్ లైన్ డెస్క్: నాని టాలీవుడ్ లో  వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో. ఈయన ఎలాంటి పాత్రలో అయినా  ఈజీగా దూరిపోగలడు. కామెడీ పాత్ర అయినా సరే లవ్, ఎమోషన్ పండించే పాత్ర అయినా సరే,  ఫైటింగ్ సీన్స్ అయినా సరే  ఏ పాత్రలో అయినా అలవోకగా నటించే హీరో ఎవరైనా ఉన్నారు అంటే చాలామందికి గుర్తుకు వచ్చేది న్యాచురల్ స్టార్ నాని మాత్రమే. ఈ విధంగా ఆయన నేచురల్ గా నటిస్తారు కాబట్టి సినిమాల్లో అంత పాపులారిటీ సంపాదించుకున్నారు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాని ఒక్కో మెట్టు ఎక్కుతూ  మంచి కంటెంట్ ఉన్నటువంటి కథలను ఎంచుకుంటూ  స్టార్ హీరోగా దూసుకెళ్తున్నారు.  

అలాంటి నాని దసరా సినిమా  బంపర్ హిట్ తర్వాత సరిపోదా శనివారంతో మన ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా ఆయనకు అద్భుతమైన హిట్ ఇచ్చిందని చెప్పవచ్చు. రిలీజ్ అయిన మొదటి రెండు రోజులు కాస్త డల్ గా ఉన్న ఆ తర్వాత వీకెండ్ నుంచి  సినిమా మంచి ఆదరణ పొందింది. ఈ సందర్భంలో నాని సరిపోతా శనివారం తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త కలెక్షన్స్ తో రికార్డు సాధించిందట. 45 కోట్ల బ్రేక్ ఈవెన్ తో రిలీజ్ అయిన ఈ మూవీ  వారు అనుకున్న టార్గెట్ రీచ్ అయినట్టు తెలుస్తోంది.

 రీచ్ అవ్వడమే కాకుండా ఈ వారంలో పెద్దగా సినిమాలు కూడా ఏం లేకపోవడం వల్ల చిత్రానికి  మరిన్ని వసూళ్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది.  ఇప్పటికే లాభాల్లో దూసుకుపోతున్న ఈ మూవీ ఈ వారంలో మరో ఐదు నుంచి 6 కోట్లు సంపాదించే అవకాశం ఉన్నట్టు చిత్ర యూనిట్ అంటున్నారు. ఈ మధ్యకాలంలో బ్రేక్ ఈవెన్ అయిన సినిమాలు చాలా తక్కువ.  ఈ టైంలో నాని సరిపోదా శనివారం బ్రేక్ ఈవెన్ కొట్టడంతో ఆయన ఖాతాలో మరో బంపర్ హిట్ పడ్డదని  సినీ ప్రేక్షకులు అంటున్నారు.

అయితే అంటే సుందరానికి అనే సినిమా ఫ్లాప్ అయిన తర్వాత అదే డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో సినిమా అంటే చాలామంది భయపడిపోయారు. కానీ వివేక్ ఆత్రేయ సరిపోదా శనివారాన్ని చాలా అద్భుతంగా తీసి ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగించాడు.  నాని సరసాన ప్రియాంక అరుళ్ మోహన్ నటించడం మరింత ప్లస్ గా చెప్పవచ్చు.  అంతే కాకుండా ఎస్ జె సూర్య విలన్ గా సినిమా రేంజ్ ని ఎక్కడికో తీసుకెళ్ళింది. ఈ విధంగా అన్నీ కలిసి వచ్చి సరిపోదా శనివారం  అద్భుతమైన హిట్స్ సాధించి రికార్డు క్లియర్ చేసిందని అంటున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu nani saripada-shanivaram s.j.surya vivek-atreya priyanka-mohan saripoda-sanivaaram-break-even

Related Articles