తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది నటులు ఉన్నారు. కాని నటుడు నరేష్ చాలా స్పెషల్. ఇండస్ట్రీలో మంచి నటుడిగా గుర్తింపు పొందినటువంటి నరేష్ పెళ్లిళ్ల విషయంలో మాత్రం కాస్త తప్పటడుగు వేశారు అని చెప్పవచ్చు. ఇప్పటికే ఇద్దరిని పెళ్లి చేసుకొని అందులో ఒకరికి విడాకులు ఇచ్చి, మరో ఆవిడకు విడాకులు ఇచ్చేందుకు రెడీ అయిపోయాడు. ఆ తర్వాత నటి పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ పవిత్ర లోకేష్ నా పక్కన ఉంటే మరో అమ్మాయిని నేను చూడను అని, ఆవిడ నా దైవం అంటూ మాట్లాడారు. మా అమ్మ విజయనిర్మల చనిపోయిన సమయంలో చాలా బాధపడ్డానని ఆ సమయంలో నాకు ధైర్యం చెప్పి నా పక్కన ఉన్నది పవిత్ర లోకేష్ మాత్రమే అని చెప్పుకొచ్చారు. నేను పవిత్ర లోకేష్ ఒక అమ్మగా కూతురుగా ఓ ఫ్రెండుగా, ఒక గైడ్ గా, శ్రేయోభిలాషిగా నాకు ఎప్పుడు భరోసా ఇస్తుందని తెలియజేశారు. ఆమె నా జీవితంలోకి వచ్చిన తర్వాత నా లైఫ్ మారిందని నరేష్ అన్నారు
న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది నటులు ఉన్నారు. కాని నటుడు నరేష్ చాలా స్పెషల్. ఈ ఇద్దరు స్టార్లు వారు ఏదైతే అనుకుంటారో అదే చేస్తారు. ఎవరో ఏమో అనుకుంటారు, ఏదో చేస్తారని అస్సలు భయపడరు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి నటుడిగా గుర్తింపు పొందినటువంటి నరేష్ పెళ్లిళ్ల విషయంలో మాత్రం కాస్త తప్పటడుగు వేశారు అని చెప్పవచ్చు.
ఇప్పటికే ఇద్దరిని పెళ్లి చేసుకొని అందులో ఒకరికి విడాకులు ఇచ్చి, మరో ఆవిడకు విడాకులు ఇచ్చేందుకు రెడీ అయిపోయాడు. ఆ తర్వాత నటి పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాడు. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి హోటల్స్, వెకేషన్స్ ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంతే కాకుండా నరేష్ పవిత్ర లోకేష్ ని చాలా ఇష్టపడతాడు. దానికి నిదర్శనం ఆయన మాటలే.
తాజాగా ఆయన మాట్లాడుతూ పవిత్ర లోకేష్ నా పక్కన ఉంటే మరో అమ్మాయిని నేను చూడను అని, ఆవిడ నా దైవం అంటూ మాట్లాడారు. మా అమ్మ విజయనిర్మల చనిపోయిన సమయంలో చాలా బాధపడ్డానని ఆ సమయంలో నాకు ధైర్యం చెప్పి నా పక్కన ఉన్నది పవిత్ర లోకేష్ మాత్రమే అని చెప్పుకొచ్చారు. నేను పవిత్ర లోకేష్ ఒక అమ్మగా కూతురుగా ఓ ఫ్రెండుగా, ఒక గైడ్ గా, శ్రేయోభిలాషిగా నాకు ఎప్పుడు భరోసా ఇస్తుందని తెలియజేశారు.
ఆమె నా జీవితంలోకి వచ్చిన తర్వాత నా లైఫ్ మారిందని, మార్నింగ్ ఆఫీస్ కి వెళ్లడం ఆ తర్వాత షూటింగ్ కి వెళ్లడం సాయంత్రానికి ఇంటికి రావడం హాయిగా తిని కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా ఉంటున్నారని చెప్పుకొచ్చారు. పవిత్ర నా జీవితాన్నే మార్చేసిందని నరేష్ అన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.