యాక్సిడెంట్ అయి నెలలు గడుస్తున్నా నవీన్ కి గాయం నొప్పి తగ్గలేదు. అంత నొప్పితోనూ జనాల్ని మరోసారి నవ్వించాడు నవీన్. ఆఫ్టర్ ఫ్రాక్చర్ లైఫ్ అంటూ ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఫన్నీ వీడియో పోస్ట్ చేశాడు.
న్యూస్ లైన్ డెస్క్ : జాతిరత్నాలు మూవీతో తెలుగు సినీ ప్రియులను నవ్వించిన హీరో నవీన్ పొలిశెట్టి. మాట్లాడే స్టైల్.. కామెడీ టైమింగ్ తో కడుపుబ్బా నవ్వించిన ఈ జాతిరత్నానికి కొన్ని నెలల క్రితం యాక్సిడెంట్ అయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో నవీన్ కుడికాలు, కుడిచేయి ఫ్రాక్చర్ అయింది. అప్పటి నుంచి ఏ పనీ సరిగ్గా చేయలేక ఇబ్బంది పడుతున్నాడు. మెయిన్ గా షూటింగ్స్ కి బ్రేక్ చెప్పక తప్పలేదు. యాక్సిడెంట్ అయి నెలలు గడుస్తున్నా నవీన్ కి గాయం నొప్పి తగ్గలేదు. అంత నొప్పితోనూ జనాల్ని మరోసారి నవ్వించాడు నవీన్. ఆఫ్టర్ ఫ్రాక్చర్ లైఫ్ అంటూ ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఫన్నీ వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో హీరో వెంకటేశ్ గణేష్ సినిమాలో ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్ అనే డైలాగ్ వస్తుండగానే నవీన్ గాయమైన తన చెయ్యి వైపు చూసుకొని ఛానల్ మార్చేశాడు. మరో ఛానల్ లో చెయ్యి చూశావా..? ఎంత రఫ్ గా ఉందో అంటూ చిరంజీవి డైలాగ్ వచ్చింది. దీంతో ఈ చెయ్యి మీద వచ్చే డైలాగ్స్ వద్దురా బాబోయ్ అంటూ స్పోర్ట్స్ ఛానల్ పెట్టాడు. సరిగ్గా అప్పుడే ఎంపైర్ రెండు చేతులు పైకి ఎత్తుతూ సిక్స్ అంటూ సిగ్నల్ ఇస్తున్నాడు. ఇదంతా చూస్తుంటే చాలా ఫన్నీగా ఉండి.. నవ్వు తెప్పించింది. ఒకవైపు చెయ్యి నొప్పి ఉన్నప్పటికీ.. నవ్వించేందుకు నవీన్ చేసిన వీడియోను అందరూ మెచ్చుకుంటున్నారు.
మరో ఛానల్ ఛేంజ్ చేయగా.. అందులో ఇప్పుడు గానకోకిలకు చప్పట్లు అనే డైలాగ్ వచ్చింది. అందరూ చప్పట్లు కొడుతుంటే నొప్పి ఉన్న చెయ్యితో చప్పట్లు కొట్టలేక ఎడమచేత్తో చెంప మీద చప్పట్లు కొట్టాడు. ఆ తర్వాత తిండి తినడానికి తాను పడుతున్న ఇబ్బందిని అర్థమయ్యేలా చూపించాడు. ఎడమచేత్తో భోజనం చేస్తూ.. ఎవరైనా ఎడమచేత్తో భోజనం చేస్తారా? ఇదేనా సంస్కారం అన్న డైలాగ్ వచ్చింది.
అదే సమయంలో నవీన్ పక్కన ఓ శునకం నోటితో డైరెక్టుగా తింటోంది. దీంతో నవీన్ దాన్ని ఫాలో అవుతూ.. గతుకుతూ తినడం పూర్తిచేశాడు. ఇదంతా మిమ్మల్ని నవ్వించేందుకు చేసిన ప్రయత్నం. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి. మీరు నవ్వుతూ ఉండటమే నాకిష్టం. పూర్తిగా కోలుకున్న తర్వాత మిమ్మల్ని మరింత సంతోషపెట్టే సినిమాలు చేస్తా ఇట్లు.. మీ జానేజిగర్ నవీన్ పొలిశెట్టి అంటూ వీడియో ముగించాడు.