ఒలింపిక్స్ 2024లో భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా ఫైనల్‌కి అర్హత సాధించాడు.
న్యూస్ లైన్ స్పోర్ట్స్: ఒలింపిక్స్ 2024లో భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా ఫైనల్‌కి అర్హత సాధించాడు. విశ్వక్రీడల జావెలిన్ త్రో పోటీల్లో వరుసగా రెండోసారి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. మంగళవారం జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్‌లో నీరజ్ జావెలిన్‌ను 89.34 మీటర్ల దూరం విసిరాడు. మొదటి ప్రయత్నంలోనే అంత దూరం బడిసెను విసిరి పతకం వేటలో అడుగు ముందుకేశాడు. చోప్రాకు ఇది కెరీర్‌లోనే రెండో అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. డిఫెండింగ్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఒలింపిక్స్‌లో మరోసారి అదరగొట్టాడు. నాలుగేండ్ల క్రితం టోక్యోలో (87.58 మీటర్ల) పసిడి పతకంతో రికార్డు క్రియేట్ చేసిన నీరజ్ విశ్వ క్రీడల్లో బంగారు పతకం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు.