Who is Shobitha : ఇంతకీ ఎవరీ శోభితా ధూళిపాళ్ల?

అక్కినేని నాగచైతన్య పెళ్లి చేసుకోబోతున్న శోభిత ధూళిపాళ్ల ఎవరనే టాపిక్ గురించి ఇప్పుడు గూగుల్ లో బాగా సెర్చ్ చేస్తున్నారు.


Published Aug 09, 2024 04:02:33 PM
postImages/2024-08-09/1723199553_shobithachaitu.jpg

న్యూస్ లైన్ డెస్క్ : సమంతాతో విడాకులైన తర్వాత అక్కినేని వారసుడు నాగచైతన్య చేసుకుంటున్న అమ్మాయి అనగానే అందరికీ ఒకింత ఆసక్తి. ఎవరా అమ్మాయి? సమంతా కంటే బాగుంటుందా? ఆమె వివరాలేంటి? ఏం చేస్తుంది? అని తెగ వెతికేస్తుంటారు. సెలెబ్రిటీల లైఫ్ అనగానే.. మామూలుగానే కాస్త ఆసక్తి ఏర్పడుతుంది. అందులోనూ కాస్త పెద్ద సెలబ్రిటీ అయితే ఇంకాస్త లోతుగా మరిన్ని విషయాల కోసం వెతుకుతుంటారు. అయితే.. ఇప్పుడు అక్కినేని నాగచైతన్య పెళ్లి చేసుకోబోతున్న శోభిత ధూళిపాళ్ల ఎవరనే టాపిక్ గురించి ఇప్పుడు గూగుల్ లో బాగా సెర్చ్ చేస్తున్నారు.

ఎవరీ శోభిత?

శోభితా ధూళపాళ్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెనాలికి చెందిన అమ్మాయి. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది. తండ్రి ధూళిపాళ్ల వేణుగోపాల్ రావు. నేవీలో ఇంజినీర్ గా చేసేవారు. తల్లి శాంతారావు గవర్నమెంట్ టీచర్. శోభిత స్కూలింగ్ అంతా వైజాగ్ లోని లిటిల్ ఏంజిల్స్ స్కూల్, విశాఖ వ్యాలీ స్కూల్లోనే గడిచింది. ఆ తర్వాత వాళ్ల నాన్నకు ముంబైకి ట్రాన్స్ ఫర్ అవడంతో పై చదువులు అక్కడే పూర్తి చేసింది. ముంబై యూనివర్సిటీ, హెచ్ఆర్ కాలేజీలో కామర్స్, ఎకనామిక్స్ పూర్తి చేసింది.

కెరీర్ పరంగా చూస్తే శోభిత నేవీబాల్ పిన్ 2010 కోసం నేవీ క్వీన్ గా ఎంపికైంది. 2013లో ఫెమినా మిస్ డియా టైటిల్ విన్నర్ గా నిలిచింది. ఆ తర్వాత ఇండియా తరపున మిస్ ఎర్త్ 2013 పోటీల్లో సైతం పాల్గొంది. కాకపోతే అక్కడ టైటిల్ గెలవలేకపోయింది. 2016లో వచ్చిన రామన్ రాఘవన్ అనే తమిళ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. అమెజాన్ ప్రైమ్ లో సూపర్ హిట్ అయిన వెబ్ సిరీస్ మేడ్ ఇన్ హెవెన్ (2019-2023) లో మెయిన్ రోల్ లో నటించింది. ఆ తర్వాత తెలుగు, మలయీళీ, హిందీ సినిమాల్లో నటించింది. కురూప్, పొన్నియన్ సెల్వన్, మేజర్ సినిమాలు శోభితాకు మంచి పేరు తెచ్చాయి.

పొన్నియన్ సెల్వన్, మేజర్ సినిమాల్లో తన నటనకు శోభిత విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇటీవలే హాలీవుడ్ లో అడుగు పెట్టిన శోభితా మంకీమ్యాన్ అనే అమెరికన్ సినిమాలో నటటిచింది. కల్కి సినిమాలో దీపికా పడుకొణెకి తెలుగు డబ్బింగ్ చెప్పింది. భరతనాట్యం, కూచిపూడిలో మంచి ఎక్స్ పర్ట్. కెరీర్ లో మంచి పేరు తెచ్చుకుంటూ దూసుకుపోతున్న శోభితా ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ అంటూ ఎవరూ లేకపోయినా సొంత కాళ్లపై ఎదిగింది. ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్థానం సంపాదించుకుంది. తక్కువ సమయంలోనే హాలీవుడ్ స్థాయికి ఎదిగిన ఈ ముద్దుగుమ్మ అక్కినేని వారింట అడుగు పెట్టబోతోంది.

newsline-whatsapp-channel
Tags : nagarjuna tollywood movie-news samantha nagachaitanya latest-news news-updates telugu-news nagachaitanya-

Related Articles