JrNtr:ఎన్టీఆర్ కు షూటింగ్ లో గాయం..ఫ్యాన్స్ సంబరాలు.!

సినిమా ఇండస్ట్రీలో నటన టాలెంట్ తో పాటు  కాస్త అదృష్టం కూడా ఉండాలి అంటారు. అంతేకాదు ఇండస్ట్రీలో కొంతమంది కొన్ని రకాల సెంటిమెంట్స్ కూడా నమ్ముతారు. అయితే ఆ చిత్రంలో ఆ


Published Aug 14, 2024 01:58:23 PM
postImages/2024-08-14/1723624103_johnvi.jpg

న్యూస్ లైన్ డెస్క్: సినిమా ఇండస్ట్రీలో నటన టాలెంట్ తో పాటు  కాస్త అదృష్టం కూడా ఉండాలి అంటారు. అంతేకాదు ఇండస్ట్రీలో కొంతమంది కొన్ని రకాల సెంటిమెంట్స్ కూడా నమ్ముతారు. అయితే ఆ చిత్రంలో ఆ సెంటిమెంట్ ఫాలో అయితే మాత్రం హిట్ అవుతుందనే ఆలోచన చాలా మందికి ఉంటుంది..ఈ మధ్యకాలంలోనే ఏపీలోని సెంటిమెంట్ చెట్టు కూడా కూలిపోయింది. అలా సినిమా ఇండస్ట్రీలో కొంతమంది దర్శక నిర్మాతలు, హీరో, హీరోయిన్లు, సెంటిమెంట్ ఫాలో అవుతూ ఉంటారు. అలా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక సెంటిమెంట్ ఉంది. అది వర్కౌట్ అయితే మాత్రం తప్పక సినిమా హిట్ అవుతుందని అంటారు. అదేంటో చూద్దామా..

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్  కొరటాల శివ డైరెక్షన్ లో దేవర మూవీ చేస్తున్నారు.  తాజాగా ఈ మూవీ షూటింగ్ ఓ మోస్తారుగా కంప్లీట్ అయిపోయినట్టే.  అయితే చివరి షెడ్యూల్ షూటింగ్ చేస్తూ ఉన్న సమయంలో స్వల్పంగా గాయపడ్డారట. అయితే ఈ విషయాన్ని మూవీ టీం బయటకు రానివ్వలేదు. కేవలం చిత్ర యూనిట్ వరకే తెలిసిన ఈ విషయం  సన్నిహిత వర్గాల ద్వారా సోషల్ మీడియాలోకి వచ్చింది. ఇంకేముంది ఇది పుంకను పుంకాలుగా వైరల్ అవుతుంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త గాబరా పడుతూనే  సంబరాలు కూడా చేసుకుంటున్నారట. ఎందుకంటే ఎన్టీఆర్ కెరియర్ స్టార్టింగ్ నుంచి గాయం సెంటిమెంటు అనేది ఉంది. అయితే ఎన్టీఆర్ డూప్ లేకుండా యాక్షన్స్ సన్నివేశాలు చేస్తుంటారు. ఈ తరుణంలోనే ఆయన గాయాల పాలవుతూ ఉంటారు.

ముఖ్యంగా స్టూడెంట్ నెంబర్ 1 చిత్రీకరణ సమయంలో గాయపడ్డారు. సినిమా సూపర్ హిట్ అయింది.  అలాగే ఆది సినిమాలో కూడా కత్తితో గాయమైంది ఆ చిత్రం సూపర్ హిట్, సింహాద్రి సినిమా సమయం లో కూడా తలకు గాయమైంది అది సూపర్ హిట్. యమదొంగ సినిమా చిత్రీకరణలో కూడా ఎన్టీఆర్ కు అది కూడా సూపర్ హిట్. అలాగే అదుర్స్ సినిమా సమయంలో కూడా గాయం అయింది  అది కూడా సూపర్ హిట్.  ఇక బృందావనం, ఆర్ ఆర్ ఆర్ చిత్రీకరణ సమయంలో కూడా గాయపడ్డారట. ఈ చిత్రాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.  ఇదే తరుణంలో దేవరా సినిమా షూటింగ్ లో కూడా ఆయనకు గాయమైనట్టు తెలుస్తోంది. దీంతో ఈ చిత్రం కూడా సూపర్ హిట్ అవుతుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది.

newsline-whatsapp-channel
Tags : news-line jr-ntr devara johnvi-kapoor koratala-shiva

Related Articles