పవన్ కళ్యాణ్ ఫస్ట్ లవ్.. చచ్చేంత ప్రేమించాడట.!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా రాజకీయాల్లో కూడా తనదైన మార్క్ చూపించాడు. ఆయన సినీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు   తన నటన తీరే వేరు ఉండేది.అలాంటి పవన్ కళ్యాణ్  ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఫస్ట్ లవ్ ఎవరో చెప్పాడు. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. ఆయన నటించిన హీరోయిన్లలో ఎవరో ఒకరు ఫస్ట్ క్రష్ అనుకుంటారు.  అది కూడా కాదు. తన ఫస్ట్ క్రష్ రివాల్వరట. అవును పవన్ కళ్యాణ్ కు గన్ అంటే చాలా ఇష్టమట. ఈ విషయాన్ని ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పాడు. రివాల్వర్ అంటే నాకు చాలా ఇష్టమని, ఈ విషయాన్ని గమనించిన అన్నయ్య చిరంజీవి లైసెన్స్ డ్ గన్ కొనిచ్చారు.ఆ గన్ చూసుకుంటూ నేను ప్రతిరోజు ఇంటి దగ్గరే ఉండిపోయాను.. తుపాకీని నేను ఎక్కడికి వెళ్లినా జేబులో పెట్టుకొని వెళ్లేవాడిని. నేను పడుకునే సమయంలో కూడా నా పక్కలోనే ఉండేది. ఉదయం లేచిన వెంటనే నా మొదట కిస్  గన్ కే ఇచ్చేవాన్ని అని, నా ఫస్ట్ లవ్ అదే అని చెప్పుకొచ్చారు.


Published Jul 16, 2024 06:20:00 PM
postImages/2024-07-16/1721128888_pawan.jpg

న్యూస్ లైన్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా రాజకీయాల్లో కూడా తనదైన మార్క్ చూపించాడు. ఆయన సినీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు   తన నటన తీరే వేరు ఉండేది. ఇండస్ట్రీలోని హీరోలంతా ఓకేత్తయితే, పవన్ కళ్యాణ్ మరో ఎత్తు. ఈయన స్టైల్, నటన తీరు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అందుకే ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా మారారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు.

ఆ విధంగా  సినిమాల్లో సక్సెస్ అయిన  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  రాజకీయంగా కూడా దేశ స్థాయిలో కీలక  వ్యక్తిగా మారాడు. నిజం చెప్పాలంటే చంద్రబాబు కీ లైఫ్ ఇచ్చాడని చెప్పవచ్చు. అలాంటి పవన్ కళ్యాణ్  ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఫస్ట్ లవ్ ఎవరో చెప్పాడు. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటికే మూడు వివాహాలు చేసుకున్నాడు. ఇందులో మొదట చేసుకున్న అమ్మాయి నందిని తన ఫస్ట్ క్రష్ అని చాలామంది అనుకుంటారు. కానీ ఆమె కాదట. లేదంటే ఆయన నటించిన హీరోయిన్లలో ఎవరో ఒకరు ఫస్ట్ క్రష్ అనుకుంటారు.

 అది కూడా కాదు. తన ఫస్ట్ క్రష్ రివాల్వరట. అవును పవన్ కళ్యాణ్ కు గన్ అంటే చాలా ఇష్టమట. ఈ విషయాన్ని ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పాడు. నా జీవితంలో అత్యంత ప్రేమగా చూసుకున్నది  రివాల్వరే అన్నారు. నేను దీంతోటే  ఎఫైర్ పెట్టుకున్నానని, ఆ రివాల్వర్ అంటే నాకు చాలా ఇష్టమని, ఈ విషయాన్ని గమనించిన అన్నయ్య చిరంజీవి, నేను గన్ కోసం ఏదైనా తీవ్రవాద సంస్థల్లో చేరుతానని భయపడి, ఆయన లైసెన్స్ డ్ గన్ కొనిచ్చారు.

ఆ గన్ చూసుకుంటూ నేను ప్రతిరోజు ఇంటి దగ్గరే ఉండిపోయాను.  అంతేకాకుండా గన్ తో అన్యాయం జరిగినచోట ప్రశ్నిస్తూ సమాధానం చెప్పాలని అనుకున్నాను. కానీ అది కుదరలేదు. తుపాకీని నేను ఎక్కడికి వెళ్లినా జేబులో పెట్టుకొని వెళ్లేవాడిని. నేను పడుకునే సమయంలో కూడా నా పక్కలోనే ఉండేది. ఉదయం లేచిన వెంటనే నా మొదట కిస్  గన్ కే ఇచ్చేవాన్ని అని, నా ఫస్ట్ లవ్ అదే అని చెప్పుకొచ్చారు.

newsline-whatsapp-channel
Tags : chiranjeevi janasena newslinetelugu pawan-kalyan rivolver pawan-first-love

Related Articles