హీరో రాజ్ తరుణ్ మోసం చేశాడంటు లావణ్య చేసిన ఆరోపణలపై రాజ్ తరుణ్ స్పందించారు. తను పెళ్లి చేసుకుంటానని ఎవ్వరిని మోసం చెయ్యలేదని ..ఈ విషయంలో తను తప్పు లేదని అన్నారు. నా వల్ల మోసం జరగలేదు కాబట్టే ధైర్యంగా నేను మీడియా ముందుకు వస్తున్నానని తెలిపారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: హీరో రాజ్ తరుణ్ మోసం చేశాడంటు లావణ్య చేసిన ఆరోపణలపై రాజ్ తరుణ్ స్పందించారు. తను పెళ్లి చేసుకుంటానని ఎవ్వరిని మోసం చెయ్యలేదని ..ఈ విషయంలో తను తప్పు లేదని అన్నారు. నా వల్ల మోసం జరగలేదు కాబట్టే ధైర్యంగా నేను మీడియా ముందుకు వస్తున్నానని తెలిపారు.
అయితే, లావణ్యతో తాను రిలేషన్ లో ఉన్నది నిజమేనని, 2014 నుంచి 2017 వరకు తాము సంబంధంలో ఉన్నామని రాజ్ తరుణ్ వెల్లడించారు. అప్పుడు కూడా జస్ట్ ప్రేమలో ఉన్నాం కాని మా మధ్య శారీరక సంబంధం లేదని తెలిపారు. విడిపోయిన కొన్ని రోజులకు ఇలానే తను బెదిరించిందని ...పరువు కోసం అప్పుడు ఏం మాట్లాడకుండా ఉండిపోయానని తెలిపారు.
అసలు తను విడిపోవాలనుకున్నది కూడా లావణ్య డ్రగ్స్ వాడడం మొదలుపెట్టినదగ్గర నుంచేనని అన్నారు. తనపై కేసులు కూడా ఉన్నాయి. అంతేకాదు లావణ్య తనతో విడిపోయి మరో వ్యక్తితో తన ఇంట్లో ఉంటుందని అన్నారు. ఆ కుర్రాడిపై కూడా లావణ్య కేసు పెట్టిందని తన దగ్గర ఆ ఎఫ్ ఐఆర్ కాపీ కూడా ఉందని ...ఇదంతా డబ్బు కోసం చేసే హంగామా అని అన్నారు.
ఇక డబ్బుకోసమే తను గుడిలో పెళ్లి చేసుకున్నట్లు చెబుతుందని అన్నారు. ఆమె అలవాట్లు, చేసే పనులు, ఆమె బుద్ధి నచ్చక విడిపోయాం. ఆమెది బ్లాక్ మెయిల్ చేసే స్వభావం అని ఆరోపించారు. కెరియర్ మొదట్టో అవకాశాలు లేనపుడు లావణ్య నాకు చాలా సాయం చేసింది . ఆ కారణంగానే తన పై ఇన్నాళ్లు ఆ కాస్త అభిమానం చూపించాను. ఇంత పెద్ద ఆరోపణలు చేస్తే ఊరుకోనని అన్నారు రాజ్ తరుణ్ . ఆమె ప్రతిదానికీ మీడియా ఎదుటకు వెళతాను, కంప్లెయింట్ చేస్తాను అని బెదిరించేందని తెలిపారు.
ఓ సినిమాలో మాల్వీ మల్హోత్రా తో కలిసి నటించాను. చాలా రోజులు కలిసి పనిచేశాం కాబట్టి మంచి ఫ్రెండ్ . కాని తనతో ఇలా లింకులు పెట్టడం కరెక్ట్ కాదని అన్నారు. మాల్వీ మల్హోత్రా సినిమా షూటింగ్ లకు హైదరాబాద్ వస్తే ఆమెకు నేనెందుకు ఆశ్రయం కల్పిస్తాను...లావణ్యకు డబ్బులు మాత్రమే కావాలి..అందుకే ఈ డ్రామా అన్నారు రాజ్ తరుణ్.
లావణ్య ను నేను పెళ్లి చేసుకోలేదు..మా మధ్య శారీరక సంబంధం కానీ, మరే ఇతర సంబంధాలు లేవు..- హీరో రాజ్ తరుణ్#RajTarun #Lavanya #HeroRajTarun #Tollywood #NTVTelugu #NTVENT pic.twitter.com/OdJ7OX14oN — NTV Telugu (@NtvTeluguLive) July 5, 2024