జక్కన్న తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రను ప్రపంచ లెవల్లో చాటిన డైరెక్టర్. అలాంటి ఈయన బాహుబలి సినిమా ద్వారా ప్రపంచ స్థాయిలో గుర్తింపు సాధించారు. ఈ చిత్రం తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమా కూడా తెరకెక్కించి చరిత్ర
న్యూస్ లైన్ డెస్క్: జక్కన్న తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రను ప్రపంచ లెవల్లో చాటిన డైరెక్టర్. అలాంటి ఈయన బాహుబలి సినిమా ద్వారా ప్రపంచ స్థాయిలో గుర్తింపు సాధించారు. ఈ చిత్రం తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమా కూడా తెరకెక్కించి చరిత్ర సృష్టించారు. అలాంటి రాజమౌళి సినిమా కెరియర్ పరంగా ఎత్తులో దూసుకుపోతున్నారు కానీ తన పర్సనల్ లైఫ్ లో మాత్రం అద్భుతమైన లవ్ స్టోరీ ఉందట..
ప్రస్తుతం రాజమౌళి భార్యగా ఉన్న రమా రాజమౌళికి అంతకుముందే ఒక పెళ్లయింది. పెళ్లి జరిగి కార్తికేయ పుట్టిన తర్వాత అనుకోని పరిస్థితులలో విడాకులు అయ్యాయి. ఆ తర్వాత రాజమౌళితో రమాకు పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. అయితే వారి లవ్ స్టోరీకి సంబంధించి తాజాగా నెట్ ఫ్లిక్స్ లో రాజమౌళిపై మోడ్రన్ మాస్టర్స్ అని డాక్యుమెంటరీ తీయగా, ప్రేమ పెళ్లి గురించి మాట్లాడింది.
రాజమౌళి మొదటిసారి మా అక్క పెళ్లిలో చూసానని, ఆ టైంలో పెద్దగా స్పెషల్ అనిపించలేదని చెప్పింది. ఆయన మా బావ గారికి తమ్ముడు అవుతాడు కాబట్టి మాటలు కలిశాయని అన్నది. అయితే రాజమౌళి నాకు మొదటగా ప్రపోజ్ చేశారని అయినా నేను నో చెప్పడంతో ఒక సంవత్సర కాలం పాటు నా వెంబడి తిరిగారని చెప్పుకొచ్చింది.
ఆ తర్వాత ఆలోచన చేసి మేమిద్దరం కలిసి ఉంటే బాగుంటుందని ఆయన లవ్ ను యాక్సెప్ట్ చేసి పెళ్లి చేసుకుందామని చెప్పింది. ప్రస్తుతం ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.