"రాజావారు రాణిగారు"పెళ్లి తో ఒకటవ్వబోతున్నారు.!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో  ఉన్నటువంటి యంగ్ హీరోలలో కిరణ్ అబ్బవరం కూడా ఒకరు. అలాంటి ఈ హీరో ఇండస్ట్రీలో చేసిన సినిమాలు తక్కువ అయినా ఓ మోస్తారుగా గుర్తింపు తెచ్చుకున్నారు.  అయితే


Published Aug 21, 2024 05:35:35 AM
postImages/2024-08-21/1724234963_KIRANABBAVARAM.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో  ఉన్నటువంటి యంగ్ హీరోలలో కిరణ్ అబ్బవరం కూడా ఒకరు. అలాంటి ఈ హీరో ఇండస్ట్రీలో చేసిన సినిమాలు తక్కువ అయినా ఓ మోస్తారుగా గుర్తింపు తెచ్చుకున్నారు.  అయితే కిరణ్ తో నటించినటువంటి మొదటి హీరోయిన్  రహస్య గోరక్.  కిరణ్ అబ్బవరంతో ఈమె రాజా వారు రాణిగారు చిత్రంలో హీరోయిన్ గా చేసింది. ఇలా ఇద్దరు కలిసి మొదటిసారి చేసినటువంటి సినిమా ద్వారానే ఒకటైపోయారు. ఈ సినిమా చేసినప్పటి నుంచే వీరిద్దరు లవ్ లో పడ్డారట.

అలా ఈ రాజావారు రాణిగారు పెళ్లి ద్వారా ఒక్కటి కాబోతున్నారు. మరికొన్ని గంటల్లో వీరి పెళ్లి భాజలు మోగబోతున్నాయి. ఇదే తరుణంలో పెళ్లికి ముందు జరిగే  హల్దీ ఫంక్షన్  వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే వీరి పెళ్లి ఆగస్టు 22వ తేదీన కర్ణాటకలోని కురుగు   లో జరగబోతున్నట్టు తెలుస్తోంది.  ఇప్పటికే ఇరు కుటుంబాల పెద్దలు కుటుంబ సభ్యులు దగ్గరి బంధువులంతా అక్కడికి చేరుకున్నారట. ఇదే తరుణంలో పెళ్లికి ముందు జరిగే ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలుపెట్టేశారు. ప్రస్తుతం వీరి ఫ్రీ వెడ్డింగ్ సంబంధించినటువంటి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ లవ్ కపుల్స్.

అలా పెళ్లికూతురు రహస్య  తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను  సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో తన కాబోయే భర్త హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి దుస్తులను అద్భుతంగా కనిపిస్తున్నారు. ఆయనకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీంతో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువ వెళ్లువెత్తుతోంది. అయితే రహస్య అబ్బవరం మొదటి సినిమా రాజావారు రాణి గారు చిత్రంలో నటించింది. ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి దూరమై జాబ్ చేస్తుంది. కానీ కిరణ్ మాత్రం ఇతర చిత్రాల్లో నటిస్తూ ఆమెతో ప్రేమ వ్యవహారం నడిపిస్తూ వచ్చారు.. చివరికి పెళ్లి ద్వారా ఒక్కటి కాబోతున్నారు.

newsline-whatsapp-channel
Tags : news-line marraige kiran-abbavaram rahasya-gorakh rajavaru-rani-garu

Related Articles