సరదాగా అసలు ముస్లింలు ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారో ..బక్రీద్ రోజు ఈ పండుగ రోజు బలి ఎందుకు చేసుకుంటారో చూద్దాం.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ప్రతి ఏడాది అరబీ నెల జిల్ హజ్ 10 వ రోజు హజ్ పెరునా అని పిలిచే బక్రీద్ పండుగను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు జరుపుకుంటారు. ఖురాన్ అవతరించిన మాసం రంజాన్ ను ఎలా అయితే జరుపుకుంటారో ...ఈ బక్రీద్ పండుగ కూడా ఇస్లాం మతస్తులకు ఓ ముఖ్యమైన పండుగ . కాని ఇది ఎందుకు జరుపుకుంటారనేది మాత్రం చాలా మందికి తెలీదు. సరదాగా అసలు ముస్లింలు ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారో ..బక్రీద్ రోజు ఈ పండుగ రోజు బలి ఎందుకు చేసుకుంటారో చూద్దాం.
ఒక రోజు అర్థరాత్రి గాఢనిద్రలో ఉన్న ఇబ్రాహింకు కల వచ్చింది. తన కుమారుడిని తానే దేవుడికి బలి ఇవ్వాలనే కల ప్రవక్తకు వచ్చింది. ఆ కలకు ఆయన చాలా భయపడతాడు. తాను కన్న కలను ప్రవక్త ఇబ్రహిం తన కుమారుడికి చెప్పాడు. ప్రవక్త ఇబ్రహం కుమారుడు తన తండ్రి అభిప్రాయానికి విరుద్దంగా ప్రవర్తించేందుకు ఇష్టపడకుండా కలలో వచ్చిన దైవ ఆదేశాన్ని వెంటనే నెరవేర్చాలని తన తండ్రితో ప్రవక్త ఇస్మాయిల్ చెప్పాడు . అయితే కొడుకు ప్రవక్త ఇస్మాయిల్ అలా చెప్పడం తండ్రికి గుండెలో బాధను కలిగించింది. దానికి ఓ మార్గాన్ని ఫాలో అవుతాడు నన్ను నేరుగా పడుకోబెట్టి నరికేస్తే మీ మనస్సు మారిపోతుంది కాబట్టి నన్ను భూమి వైపు చూస్తూ పడుకోబెట్టి నా తలను నరికి బలి ఇవ్వమని సలహా ఇస్తాడు.
అప్పుడు జిబ్రయిల్ అని పిలిచే దేవదూతను పంపించి అల్లాహ్ ఆ బలిని ఆపాడు. అక్కడ ఇస్మాయిల్ కు బదులుగా ఓ గొర్రెని బలి ఇవ్వమని అల్లాప్ ఆజ్జాపిస్తాడు . కుమారుడు ప్రవక్త ఇస్మాయిల్ ప్రాణాలనే బలి ఇచ్చేందుకు సాహసించిన ఆ తండ్రి త్యాగాన్ని ప్రశంసిస్తూ ఆ నరబలిని అల్లాహ్ ఆపాడు. ఆ రోజు ఆ ఘటన కు గుర్తుగా ప్రతి ఏడాది గొర్రెను ఒంటెను బలిఇస్తూ అందరు పంచుకొని తినమని దైవవాణి చెప్పిందని అంటుంటారు. ఈ కారణంగా వల్లే ఖుర్బానీ అనేది బక్రీద్ పండుగ లో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. రంజాన్ రోజుల్లో ఉపవాసం ఉండి ఆహారాన్ని పంచుకుంటారు. కాని బక్రీద్ పండుగ లో ఆహారం వల్ల గొర్రెలు , ఆవులు , ఒంటెల మాంసాన్ని పంచుకుంటారు.