అఖిల్ , జైనబ్ ప్రేమలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఇరు పెద్దల అనుమతితో లాస్ట్ ఇయర్ నవంబర్ 26న వీరి నిశ్చితార్థం అట్టహాసంగా జరిగింది
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ఇప్పుడు ఇండస్ట్రీ అంతా అఖిల్ పెళ్లి సందడే. ఈ ప్రేమ జంట పెళ్లి సందడి మొదలైంది. జూన్ 6 న అఖిల్ -జైనాబ్ ల పెళ్లి జరుగుతున్నట్లు సమాచారం. అఫిషియల్ గా అనౌన్స్ చెయ్యలేదు కాని పెళ్లి పనులు జరుగుతున్నాయనే టాక్ నడుస్తుంది. నాగ చైతన్య వివాహం లాగానే అఖిల్ వివాహం కూడా అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగానే జరగనుంది. అఖిల్ పెళ్లి వేడుకకు సంబంధించి ఇప్పటికే పనులు కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది.
అఖిల్ , జైనబ్ ప్రేమలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఇరు పెద్దల అనుమతితో లాస్ట్ ఇయర్ నవంబర్ 26న వీరి నిశ్చితార్థం అట్టహాసంగా జరిగింది. ఎంగేజ్ మెంట్ తర్వాత ఈ జంట చాలా సార్లు కలిసి కనిపించారు. చాలా ట్రిప్స్ కు కూడా వెళ్లారు. అయితే సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అఖిల్ లెనిన్ సినిమా చేస్తున్నాడు. శ్రీలీల ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.