న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : కిరణ్ అబ్బవరం " క" మూవీతో హిట్ కొట్టి మంచి ఫామ్ లో ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ ఉన్నాడు.తన కొత్త సినిమాని అనౌన్స్ చేస్తూ టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేసారు. ఈ సినిమాని బేబీ నిర్మాత SKN నిర్మిస్తుండగా బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ ఇచ్చిన కథతో రవి నంబూరి డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ఇదిమరో బేబి లాంటి కల్ట్ మూవీలా ఉండబోతుందంటున్నారు.
కిరణ్ అబ్బవరం కొత్త సినిమా టైటిల్ ను " చెన్నై లవ్ స్టోరీ " అని ప్రకటించారు. ఈ సినిమా శ్రీ గౌరీ ప్రియా హీరోయిన్ గా చేస్తుంది. ఈ గ్లింప్స్ కూడా చాలా క్రేజీ గా ఉన్నాయి. ఈ గ్లింప్స్ లో కిరణ్ అబ్బరం కొత్త సినిమా టైటిల్ లవ్ స్టోరీ అని ప్రకటించారు. ఈ గ్లింప్స్ లో కిరణ్ అబ్బవరం హీరోయిన్ తో సముద్రం ఒడ్డున కూర్చొని ప్రేమ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ గ్లింప్స్ చూస్తుంటే చెన్నైలో జరిగే ఈ క్రింజ్ లవ్ స్టోరీ కథతో మరో కల్ట్ సినిమా తీసుకురాబోతున్నారు అని తెలుస్తుంది.