దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఇది చూసినవారంతా.. రకరకాలుగా స్పందిస్తున్నారు. నిజాయతీపరుడైన అధికారి కమలాసన్ రెడ్డిపై ఈ బెదిరింపు ప్రయత్నాన్ని ఖండించాలని డిమాండ్ చేశారు. తాజగా, ఈ అంశంపై మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు.
న్యూస్ లైన్ డెస్క్: కొడంగల్ నియోజకవర్గంలో నిర్మించనున్న ఫార్మా కంపెనీ తమకు వద్దని అక్కడి ఐదు గ్రామాలకు చెందిన ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఈ అంశంపై ఓ జర్నలిస్ట్ ప్రశ్నించేందుకు అఖిల భారత సర్వీసుకు బిగ్ టీవీకి చెందిన ఓ జర్నలిస్ట్ వెళ్లింది. అయితే, ఒకసారి ఇంటర్ వ్యూ చేసి అఖిల భారత సర్వీస్ అధికారి కమలాసన్ రెడ్డిని పలు ప్రశ్నలు అడిగారు. ఆ తరువాత లోపలికి వెళ్లి తన పని చేసుకుంటున్న కమలాసన్ రెడ్డి వద్దకు ఆ జర్నలిస్ట్ వెళ్లి తొందరపాటుగా ఇష్టం వచ్చినట్లు ప్రశ్నలు అడిగింది.
ఓవైపు ఆఫీసు సిబ్బంది మీడియా వారిని అడ్డుకుంటున్నా వినిపించుకోకుండా లోపలికి వెళ్లారు. మీ ఉద్యాగానికి రాజీనామా చేస్తారా అని కమలాసన్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించింది. అయితే, తనకు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడం ఇష్టం లేదని, దయచేసి వెళ్లిపొమ్మని ఆయన అడిగినప్పటికీ ఆ జర్నలిస్ట్ అలానే తన వద్దకు వెళ్లి ఈ పోస్టుకు అర్హత లేదని. రిజైన్ చేసేస్తారా అని ప్రశ్నించింది.
దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఇది చూసినవారంతా.. రకరకాలుగా స్పందిస్తున్నారు. నిజాయతీపరుడైన అధికారి కమలాసన్ రెడ్డిపై ఈ బెదిరింపు ప్రయత్నాన్ని ఖండించాలని డిమాండ్ చేశారు. తాజగా, ఈ అంశంపై మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. ప్రాక్సీ మీడియా హౌస్‌ని ఉపయోగించి అఖిల భారత సర్వీసు అధికారులను బెదిరించడం దిగ్భ్రాంతికరమని ఆయన ట్వీట్ చేశారు. కమలాసన్ రెడ్డి ఒక నిజాయితీపరుడైన IPS అధికారి, పైగా ఎటువంటి రిమార్క్ లేని వ్యక్తి అని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇటువంటి పనికిమాలిన పని చేస్తోందని ఆయన ప్రశ్నించారు.