తన పెళ్లి వార్తలపై స్పందిస్తూ సాయి ధరమ్ తేజ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పాడు.
న్యూస్ లైన్ డెస్క్: తన పెళ్లి గురించి వస్తున రూమర్స్‌పై మెగా హీరో సాయి దుర్గా తేజ్ స్పందించారు. ఉషా పరిణయం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న సాయి ధరమ్ తేజ్ యాంకర్ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
‘మీ లవ్ గురించి చెప్పండి’ అని అడగ్గా ‘‘వన్‌సైడ్ లవ్ ఉంది. అటు నుంచి ఇంకా రిప్లై రాలేదు. ఎవరైనా అమ్మాయి నచ్చి.. మాట్లాడేలోపు ‘మీకు పెళ్లి అయిపోయిందట కదా’ అనేస్తున్నారు... అనింటూ నవ్వుతూ రిప్లయ్ ఇచ్చారు. ‘త్వరలో మెగావారింట పెళ్లి సందడి మొదలవబోతోంది అంటూ వార్తలు వస్తున్నాయి. మీ పెళ్లి విషయంలో రెండు పేర్లు బాగా ప్రచారంలో ఉన్నాయి అవి నిజమేనా?’ అని అడగగా.. ‘‘నేను చేసిన సోలో బ్రతుకే సో బెటర్ మూవీలో ‘నో పెళ్లి’ అనే పాట ఉంది తెలుసు కదా’’ అంటూ బదులిచ్చారు.