కోలీవుడ్ హీరో విజయ్ పై గత కొద్దిరోజుల తమిళనాడులో ఒక ప్రచారం జరుగుతుంది. అదేంటంటే విజయ్ తన భార్య పిల్లలకు దూరంగా ఉన్నాడని,వీరిద్దరి మధ్య సఖ్యత లేదు అని.అంతేకాదు త్రిష, కీర్తి సురేష్ వంటి హీరోయిన్ల
న్యూస్ లైన్ డెస్క్: కోలీవుడ్ హీరో విజయ్ పై గత కొద్దిరోజుల తమిళనాడులో ఒక ప్రచారం జరుగుతుంది. అదేంటంటే విజయ్ తన భార్య పిల్లలకు దూరంగా ఉన్నాడని,వీరిద్దరి మధ్య సఖ్యత లేదు అని.అంతేకాదు త్రిష, కీర్తి సురేష్ వంటి హీరోయిన్ల కారణంగా భార్యతో విజయ్ కి విభేదాలు వచ్చాయని, ప్రస్తుతం భార్యతో విడాకులు తీసుకునే దిశగా ఆలోచన కూడా చేస్తున్నాడు అని కోలీవుడ్ లోని కొంతమంది మాట్లాడుకుంటున్నారు.
అయితే ఇలాంటి వేళ తాజాగా భర్త పై పగబట్టిన సంగీత తండ్రిపై ఎదురుదాడికి కొడుకుని తయారు చేస్తుంది అంటూ కోలీవుడ్లో ప్రచారం జరుగుతుంది.. అదేంటంటే.. విజయ్ కొడుకు సంజయ్ తాజాగా దర్శకుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నట్టు ఒక ఫోటో చక్కర్లు కొట్టిన సంగతి మనకు తెలిసిందే. సందీప్ కిషన్ హీరోగా విజయ్ కొడుకు సంజయ్ దర్శకుడుగా లైకా సంస్థలో ఓ మూవీ రాబోతుందని అఫీషియల్ గా ప్రకటించారు.
అయితే విజయ్ కి కొడుకు డైరెక్టర్ అవడం ఇష్టం లేదట. కానీ భార్య సంగీత కావాలనే భర్త మీద పగబట్టి అలా భర్తకి వ్యతిరేకంగా కొడుకుని తయారు చేస్తోందని,కావాలనే ఆమె తన కొడుకుని ఇండస్ట్రీకే దర్శకుడిగా పంపిస్తుందని కోలీవుడ్ లోని కొంతమంది మాట్లాడుకుంటున్నారు.
అంతేకాదు విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టాక కూడా కుటుంబం నుండి విజయ్ కి ఎదురుదెబ్బే తగులుతుందని, తనని పెళ్లి చేసుకొని మోసం చేసి వేరే హీరోయిన్లతో విజయ్ చేసిన పనికి సంగీత పగబట్టి ఇలా చేస్తోందని తమిళ ఇన్సైడ్ వర్గాల ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మరి చూడాలి విజయ్ పై కుటుంబం తిరుగుబాటు ఇంకా ఎన్ని రోజుల వరకు కొనసాగుతుందో