డాకూ మహరాజ్ అంటూ బాలయ్య కూడా రంగంలోకి దిగిపోయారు. ఈ ఇద్దరే కాదు నేనున్నానంటూ సంక్రాంతికి వస్తున్నారు అనిల్ రావిపూడి.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : పాన్ ఇండియా సినిమాలకు ఈ రోజుల్లో ప్రమోషన్స్ చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. కాని రీజినల్ సినిమాలకు కూడా అదే స్థాయిలో ప్రమోషన్స్ మొదలుపెడుతున్నారు మేకర్స్ ...సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల్లో ప్రమోషన్స్ జోరు చాలా పెరిగింది.గేమ్ ఛేంజర్‌కు పోటీగా మిగిలిన రెండు సినిమాలు దూకుడు చూపిస్తున్నాయి.రామ్ చరణ్ డల్లాస్ లో ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇటు డాకూ మహరాజ్ అంటూ బాలయ్య కూడా రంగంలోకి దిగిపోయారు. ఈ ఇద్దరే కాదు నేనున్నానంటూ సంక్రాంతికి వస్తున్నారు అనిల్ రావిపూడి.
డిసెంబర్ 21న అమెరికాలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయ్యింది. అనీల్ రావిపూడి యూట్యూబ్ షార్ట్స్ తో పాటు సోషల్ మీడియాలో వారి ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు.రమణ గోగులతో పాడించిన ఫస్ట్ సింగిల్ అదిరిపోయింది. రీసెంట్ గా రెండో పాట కూడా సూపర్ డూపర్ గా జనాల్లోకి వెళ్లింది.మూడో పాట అప్డేట్ కూడా వచ్చింది. ఇది త్వరలో రానుంది.
ఇక బాలయ్య డాకూ మహరాజ్ ప్రీ రిలీజ్ కూడా అమెరికాలోనే ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి ఈ సినిమా నుంచి టీజర్, రెండు సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మొత్తానికి పండగ సినిమాలు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. మరి బాలయ్య , వెంకి తో పాటు రామ్ చరణ్ ఈ సంక్రాంతికి ఎవరు బ్లాక్ బాస్టర్ కొడతారో చూడాలి.