sapthagiri: సప్తగిరి పెళ్లి కాని ప్రసాద్ టీజర్ ....శాసనాల గ్రంధం అంటూ నవ్వులే నవ్వులు !

అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కెవై బాబు, భాను ప్రకాష్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సప్తగిరి సరసన ప్రియాంక శర్మ నటిస్తుంది.


Published Mar 03, 2025 03:25:00 PM
postImages/2025-03-03/1740995829_Sapthagiri.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: చాలా నెలలు గ్యాప్ తీసుకొని సాలిడ్ కాన్సప్ట్ తో వచ్చేస్తున్నాడు సప్తగిరి . మళ్ళీ హీరోగా త్వరలో పెళ్లి కానీ ప్రసాద్ అనే సినిమాతో రాబోతున్నాడు. తాజాగా నేడు ప్రభాస్ ఈ సినిమా టీజర్ ని సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. చాలా సినిమా లు హీరోగా చేసినా... పెద్దగా కలిసిరాలేదు.  ఇప్పుడు మళ్లీ హీరోగా వస్తున్నాడు.


మల్లీశ్వరి సినిమాలో వెంకీమామ పేరు పెళ్లి కానీ ప్రసాద్.  అదే పేరుతో సప్తగిరి రాబోతున్నాడు. అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కెవై బాబు, భాను ప్రకాష్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సప్తగిరి సరసన ప్రియాంక శర్మ నటిస్తుంది. ప్రభాస్ ఈ మూవీ టీం కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. టీజర్ అియతే ఫుల్ ఫన్ . కట్నం లేకుండా పెళ్లి చేసుకోకూడదు అనే తండ్రి.. పెళ్లి కోసం ఆరాటపడే కొడుకు కథనే ఈ సినిమా .


” ప్రసాద్ అనే నేను.. కట్నం శాసనాల గ్రంధంలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కు మర్యాద ఇస్తూ.. తరతరాలుగా కట్నం విషయంలో మా తాతముత్తత్తాలు ఫాలో అవుతున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ కు కట్టుబడి ఉంటాను అని ప్రమాణం చేస్తున్నాను” అంటూ సప్తగిరి డైలాగ్ తో టీజర్ మొదలయ్యింది.  అసలు కట్నాల శాసనం అనగానే...నవ్వులే నవ్వులు. 


ప్రసాద్ కు ఏజ్ బారు అవుతున్నా పెళ్లి కాదు. ప్రసాద్ తండ్రి రూ. 2 కోట్లు కట్నం ఇచ్చే సంబంధం కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. ఆయన తండ్రిగా మురళీధర్ గౌడ్ అదరగొట్టేశాడు. ఇక శేఖర్ చంద్ర మ్యూజిక్ ఈ సినిమాకు హైలైట్ గా మారుతుంది. మార్చి 21 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu movie-news comedians teaser-release

Related Articles