TTD: టీటీడీ శిల్పకళా సంస్థలో ఉచిత కోర్సులు ..దరఖాస్తులు ఎప్పటి వరకు అంటే !

2025-26 విద్యా సంవత్సరానికి గాను వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.


Published May 06, 2025 08:05:00 AM
postImages/2025-05-06/1746499053_SculpturesGallerySriVenkateswaraMuseumTTDMuseumTirumala.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ప్రాచీన భారతీయ ఆలయ నిర్మాణ శిల్పకళను పరరక్షించి , భావితరాలకు అందించాలనే ఉదాత్త లక్ష్యంతో టీటీడీ విశేష కృషి చేస్తుంది. ఇందులో భాగంగా టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న వెంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప శిక్షణ సంస్థ ద్వారా ఆసక్తిగల యువతకు ఉచితంగా శిక్షణ అందిస్తుంది. 2025-26 విద్యా సంవత్సరానికి గాను వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.


1960లో స్థాపించబడిన ఈ సంస్థ, శిల్పశాస్త్ర నియమాలకు అనుగుణంగా భారతీయ సంస్కృతి, శిల్పకళాకృతులను .భావితరాలకు అందించాలనే ఉద్దేశ్యంతో టీటీడీ ఉచిత కోర్పులు అందిస్తుంది. రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ , ఏఐసీటీఈ గుర్తింపు పొందిన నాలుగేళ్ల " డిప్లమో ఇన్ ట్రెడిషనల్ స్కల్ప్చర్ " కోర్సులో ఆరు విభాగాలున్నాయి. ఆలయ నిర్మాణం, శిలా శిల్పం, సుధా శిల్పం, లోహ శిల్పం, కొయ్య శిల్పం, సంప్రదాయ వర్ణచిత్ర లేఖనం. ప్రతి విభాగంలో ఏటా 10 మందికి, మొత్తం 60 మందికి ప్రవేశం కల్పిస్తారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారు ఈ కోర్సుకు అర్హులు. అయితే వస్త్రాలపై బొమ్మలను చిత్రించే సంప్రదాయ కళంకారి కళలో రెండేళ్ల కోర్సు కూడా ఉంది. దీనిలో ఏటా 10 మందికి ప్రవేవం కల్పిస్తారు. ఈ కోర్సుకు కూడా పదో తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి.


ఈ రెండు కోర్సుల్లో చేరిన విద్యార్థులందరికీ టీటీడీ ఉచితంగా వసతి, భోజన సౌకర్యాలను కల్పిస్తోంది. డిప్లొమా చివరి సంవత్సరం విద్యార్థులకు క్షేత్రస్థాయి అవగాహన కోసం దక్షిణ భారతదేశంలోని ప్రఖ్యాత చారిత్రక ఆలయాలకు ఉచితంగా విజ్ఞాన యాత్రలు ఏర్పాటు చేస్తారు. చాలా వరకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తుంది.. 2025-26 విద్యా సంవత్సరానికి గాను మే 5వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాదు ఈ కోర్పు కంప్లీట్ చేసిన వారికి  చివరి యేడాది టీటీడీ నే లక్షరూపాయిలు ఇస్తుంది. మీరు స్థిరపడడానికి అవకాశం కల్పిస్తుంది.

మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన చిరునామా:

శ్రీ వేంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పశిక్షణ సంస్థ,
తిరుమల తిరుపతి దేవస్థానములు,
అలిపిరి రోడ్, తిరుపతి – 517507,
తిరుపతి జిల్లా.
వెబ్ సైట్: https://ttdevasthanams.ap.gov.in/
ఫోన్ నెం: 0877 – 2264637.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu education ttd

Related Articles