మెగా మాజీ అల్లుడు అంటే చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ ఈ మధ్యనే మరణించారు. అయితే ఆయన మరణం పై తొలిసారి నోరు విప్పింది శిరీష్ భరద్వాజ్ తల్లి.. అంతేకాదు తండ్రి చనిపోతే కనీసం కూతుర్ని చూడనివ్వలేదు అంటూ మెగా ఫ్యామిలీ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.మరి ఇంతకీ శిరీష్ తల్లి ఏం మాట్లాడిందో ఇప్పుడు చూద్దాం.. నా కొడుకు మరణించాడు అనే విషయం తెలియగానే వాడి కూతురు నివృతి ఉంది కాబట్టి ఈ విషయాన్ని మెగా ఫ్యామిలీకి తెలియజేశాను. కానీ మెగా ఫ్యామిలీ కి విషయం చెప్పినా కూడా వాళ్ళు స్పందించలేదు రాలేదు.అలాగే నా మనవరాలిని కూడా తండ్రి చివరి చూపుకు నోచుకోకుండా చేశారు. ఇక నేను చచ్చేలోపైనా కూడా నా మనవరాలిని నాకు వాళ్ళు చూపిస్తారో లేదో తెలియదు అంటూ మెగా ఫ్యామిలీ పై షాకింగ్ కామెంట్స్ చేసింది
న్యూస్ లైన్ డెస్క్: మెగా మాజీ అల్లుడు అంటే చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ ఈ మధ్యనే మరణించారు.అయితే ఆయన మరణం పై తొలిసారి నోరు విప్పింది శిరీష్ భరద్వాజ్ తల్లి.. అంతేకాదు తండ్రి చనిపోతే కనీసం కూతుర్ని చూడనివ్వలేదు అంటూ మెగా ఫ్యామిలీ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.మరి ఇంతకీ శిరీష్ తల్లి ఏం మాట్లాడిందో ఇప్పుడు చూద్దాం.. శిరీష్ భరద్వాజ్ శ్రీజ ప్రేమించి పెళ్లి చేసుకొని నివృతి అనే పాప పుట్టాక విడాకులు తీసుకున్నారు.ఇక విడాకుల తర్వాత ఇద్దరు మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్నారు. ఇక శ్రీజకు రెండో పెళ్లి కూడా విఫలమైంది. అయితే రీసెంట్ గా శ్రీజ మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ అనారోగ్య సమస్యలతో మరణించారు.
ఇక ఆయన మరణం పై ఎన్నో రూమర్స్ వినిపించాయని, అందులో ఎలాంటి నిజం లేదు అంటూ శిరీష్ తల్లి కొట్టిపారేసింది. ఆమె రీసెంట్గా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా కొడుకు ఊపిరితిత్తుల సమస్యల వల్ల చనిపోలేదు. దుబాయ్ కి వెళ్లి బర్త్డే జరుపుకొని ఇంటికి వచ్చాక కొద్ది రోజులకే ఆరోగ్యం పాడవడంతో హాస్పిటల్లో చేర్పించాం. అలా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుండగానే ఉన్నట్టుండి హాట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. ఇక నా కొడుకు మరణించాడు అనే విషయం తెలియగానే వాడి కూతురు నివృతి ఉంది కాబట్టి ఈ విషయాన్ని మెగా ఫ్యామిలీకి తెలియజేశాను.
కానీ మెగా ఫ్యామిలీ కి విషయం చెప్పినా కూడా వాళ్ళు స్పందించలేదు రాలేదు.అలాగే నా మనవరాలిని కూడా తండ్రి చివరి చూపుకు నోచుకోకుండా చేశారు. ఇక నేను చచ్చేలోపైనా కూడా నా మనవరాలిని నాకు వాళ్ళు చూపిస్తారో లేదో తెలియదు అంటూ మెగా ఫ్యామిలీ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇక శిరీష్ తల్లి కామెంట్లను బట్టి చూస్తే మెగా ఫ్యామిలీ శిరీష్ భరద్వాజ్ కి పుట్టిన పాపని పూర్తిగా శిరీష్ ఫ్యామిలీతో దూరం చేశారని భావిస్తున్నారు. ఎంతైనా నివృతి శిరీష్ కి కన్నబిడ్డ కాబట్టి చనిపోయిన సమయంలో చివరి చూపైనా చూడనిస్తే మెగా ఫ్యామిలీని అందరూ మెచ్చుకునేవారు. కానీ ఇలా చేసి అందరిలో బ్యాడ్ అయిపోయారు అంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు