Janmashtami 2024: హే కృష్ణ.. జగన్నాథ పుట్టినరోజు శుభాకాంక్షలు స్వామి !

కారాగారంలో పుట్టాడు..తల్లితండ్రికి దూరంగా ఉన్నాడు..సొంత మేనమామ చంపాలని వేసే ప్రతి పనిని తప్పించుకొని బ్రతికి బట్టకట్టాడు.


Published Aug 26, 2024 01:30:00 PM
postImages/2024-08-26/1724659243_krishnaquotes.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కన్నయ్య ..జీవితం అంతా సంఘర్షణలే..ధర్మ సంరక్షణకు ఓ  వైపు...బంధుత్వానికి మరో వైపు ..జీవన మరణ సమయాల్లో కూడా ధర్మాన్ని నిలబెడుతూ ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాడు. కారాగారంలో పుట్టాడు..తల్లితండ్రికి దూరంగా ఉన్నాడు..సొంత మేనమామ చంపాలని వేసే ప్రతి పనిని తప్పించుకొని బ్రతికి బట్టకట్టాడు. ఎంతో ప్రేమగా పెంచుకున్న నంద -యశోద దేవిలను ...ఎంతో ప్రేమించిన గోకులాన్ని వదిలి మధుర చేరుకున్నాడు.


ఎప్పుడు నవ్వుతూ తిరిగినా ...ఎన్నో సవాళ్లను ..కష్టాలను దిగమింగాడు పద్మనాభుడు. కృష్ణ భక్తితో మనసులు ఉప్పొంగిపోతున్న క్షణాలివి. యుగాలు మారినా..తరాలు మారినా.. కృష్ణ తత్వం ప్రపంచానికి దారి చూపుతూనే ఉంది. కృష్ణుడంటే ప్రేమ, కృష్ణుడంటే సమర్పణ, కన్నయ్య అంటే త్యాగం..కృష్ణుడంటే సృష్టికర్త. కృష్ణుడంటే ఛైతన్య బోధ. యుద్దనీతికి ..రాజనీతికి మాధవుడే మార్గదర్శి. కృష్ణా కష్టం అంటే అక్కడ నీకు సాయం చెయ్యడానికి కూర్చుంటాడు. మధుసూధనా ...నీకు తెలియని కష్టాలా..నీకు తెలియని సమాధానాలా స్వామి. 


జరాసంధుడితో పదేపదే యుద్ధాలను నివారించడానికి మధుర నుంచి కూడా దూరం కావాల్సివచ్చింది. ఎంతో వైభవంగా ...దేవ దేవతలే ఆశ్చర్యపోయేలా కట్టిన ద్వారక నీట మునిగింది. ధర్మసంస్థాపన కోసం కుంతీదేవి శాపానికి గురి కావాల్సి వచ్చింది. ఊరు కోసం గోవర్ధనగిరి ఎత్తి సాయం చేయడం నేర్పించాడు. బావ అర్జునుడి కోసం మాధవుడు ఎంత చేయగలిాడో అంతా చేశాడు. కర్తవ్యం కోసం అభిమన్యుడు చావుకు ఎదురువెళ్తుంటే ..తన మరణం గురించి తెలిసి కూడా విధికి తలవంచాడు. గోపాలకుల చనువుతో చల్ది ముద్దలు తిన్నాడు. స్నేహం కోసం మధుర రాజైనా ..కుచేలుడు దగ్గర గుప్పెడు అటుకులు , బె్ల్లం తిన్నాడు. పద్మానాభుడు ఏం చేసినా లోక కళ్యాణానికే చేశాడు. యుద్దాన్ని నడిపించాడు. ధర్మాన్ని నిలబెట్టాడు. సామాన్యులకు కృష్ణుడు అర్ధం కాడు..అర్ధమయినా ..పూర్తిగా తనలో దైవత్వాన్ని అర్ధం చేసుకోవడానికి జీవితం సరిపోదు. జై శ్రీకృష్ణా.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu krishna bhagavad-gita sri-krishnashtami

Related Articles