Exit polls: హర్యానా, కాశ్మీర్ లో ఆ పార్టీదే హవా.?

తాజాగా హర్యానా  జమ్మూ కాశ్మీర్ లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిగాయి. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా తప్పకుండా ఎగ్జిట్ పోల్స్ అనేవి ముందుగా వస్తాయి.  ఆ విధంగానే హర్యానా, జమ్మూ కాశ్మీర్ 


Published Oct 05, 2024 09:03:49 PM
postImages/2024-10-05/1728142429_bjpcongress.jpg

న్యూస్ లైన్ డెస్క్: తాజాగా హర్యానా  జమ్మూ కాశ్మీర్ లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిగాయి. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా తప్పకుండా ఎగ్జిట్ పోల్స్ అనేవి ముందుగా వస్తాయి.  ఆ విధంగానే హర్యానా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో  ఎగ్జిట్ పోల్స్ ఇలా ఉన్నాయి. పలు ప్రముఖమైన సంస్థలు ఈ ఎగ్జిట్ పోల్స్ నిర్వహించారు.

 వారిచ్చిన సమాచారం ప్రకారం.. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కూటమికే మంచి అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. హర్యానా రాష్ట్రంలో చాలా కాలంగా బిజెపి సర్కార్ కొలువుదీరి ఉంది. దీంతో ఆ పార్టీపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కూడా వచ్చింది. దీన్ని బట్టి చూస్తే మాత్రం అక్కడ కాంగ్రెస్ తప్పనిసరిగా  విజయం సాధిస్తుందని తెలుస్తోంది.  ఇక్కడ విజయం సాధిస్తే కాంగ్రెస్ అధికారంలో ఉన్న జాబితాలో హర్యానా కూడా చేరిపోతుందని అంటున్నారు.

జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే లాద్దాక్ లేకుండా నిర్వహించినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమియే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ తెలియజేస్తున్నాయి. అయితే ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఫరూక్ అబ్దుల్లా  నేషనల్ కాంగ్రెస్ కాన్ఫరెన్స్ తో కలిసి పోటీ చేశారు.  కాబట్టి ఈ పార్టీ ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు తెలియజేస్తున్నాయి. ఎక్కువ సంస్థలు కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నాయని మరికొన్ని సంస్థలు హంగ్ వచ్చే అవకాశం ఉందని తెలియజేస్తున్నాయి.

ఈ విధంగా ప్రస్తుతం జరుగుతున్న చాలా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలాన్ని పుంజుకుంటూ ముందుకు వెళ్తోంది.  ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం రిజల్ట్ ఉంటే మాత్రం తప్పనిసరిగా  మరో ఏడాదిలో జరిగేట్ టువంటి బీహార్, మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కు ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మరి చూడాలి ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎప్పుడు చాలా క్లియర్ గా ఏమీ ఉండవు. ఏది ఏమైనా బిజెపి మాత్రం కాస్త వెనుకబడిందని చెప్పవచ్చు.

newsline-whatsapp-channel
Tags : news-line congress bjp kashmir haryana exit-polls

Related Articles