మన భారతదేశ సంప్రదాయం ప్రకారం రాఖీ కట్టిన వారిని అన్నతో భావిస్తారు. కట్టించుకున్న వాళ్లు కూడా వారిని తమ సొంత చెల్లెళ్లుగా అక్కలుగా భావిస్తారు. అయితే సెలబ్రిటీలకు ఇవన్నీ పట్టవు కావచ్చు. ఎందుకంటే ఓ నిర్మాతకి రాఖీ కట్టిన
న్యూస్ లైన్ డెస్క్: మన భారతదేశ సంప్రదాయం ప్రకారం రాఖీ కట్టిన వారిని అన్నతో భావిస్తారు. కట్టించుకున్న వాళ్లు కూడా వారిని తమ సొంత చెల్లెళ్లుగా అక్కలుగా భావిస్తారు. అయితే సెలబ్రిటీలకు ఇవన్నీ పట్టవు కావచ్చు. ఎందుకంటే ఓ నిర్మాతకి రాఖీ కట్టిన హీరోయిన్ ఆయనతోనే పిల్లల్ని కన్నది.మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. ఎందుకు అలా చేసింది అనేది ఇప్పుడు చూద్దాం. రాఖీ కట్టిన నిర్మాత తో పిల్లల్ని కన్న ఆ హీరోయిన్ ఎవరో కాదు
దివంగత నటి శ్రీదేవి. అవును మీరు వినేది నిజమే.. శ్రీదేవి బోనికపూర్ ని పెళ్లి చేసుకునే కంటే ముందే రాఖీ కట్టింది.మరి అలా రాఖి ఎందుకు కట్టాల్సి వచ్చిందయ్యా అంటే.. శ్రీదేవి బోణి కపూర్ కంటే ముందు బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తితో రిలేషన్ లో ఉంది.వీరిద్దరి మధ్య డేటింగ్ చాలా రోజులు కొనసాగింది. కానీ మిథున్ చక్రవర్తికి శ్రీదేవి పై చాలా అనుమానం ఉండేది. ఎందుకంటే శ్రీదేవి చాలా అందంగా ఉండేది.
కాబట్టి ఆమె ఎవరితో మాట్లాడినా కూడా చాలా అనుమానం పెంచుకునేవాడు.అయితే ఓ రోజు బోణికపూర్ తో సన్నిహితంగా ఉన్న శ్రీదేవిని చూసి మిథున్ చక్రవర్తి కాస్త అనుమాన పడ్డారట. అయితే ఈ అనుమానం మరింత ఎక్కువవ్వడంతో తన అనుమానం తీరడానికి బోణి కపూర్ కి రాఖీ కట్టమని మిథున్ చక్రవర్తి శ్రీదేవికి చెప్పారట.
దాంతో బోణి కపూర్ తో తనకి ఎలాంటి చెడు రిలేషన్ లేదని నిరూపించుకోవడానికి శ్రీదేవి బోణి కపూర్ కి రాఖీ కూడా కట్టిందట. కానీ విచిత్రం ఏమిటంటే.. మిథున్ చక్రవర్తితో బ్రేకప్ అయ్యాక బోనీకపూర్ ని శ్రీదేవి ప్రేమించి పెళ్లాడింది.అలా వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు.దాంతో శ్రీదేవి బోనీ కపూర్ కి రాఖీ కట్టి ఆయనతోనే పిల్లల్ని కన్నది అంటూ అప్పట్లో మీడియాలో కొన్ని వార్తలు గుప్పుమన్నాయి