రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలులో ఉంది. అయితే.. ప్రభుత్వం కొత్తగా తేనున్న సెమీ డీలక్స్, మెట్రో డీలక్స్ బస్సుల్లో ప్రయాణించాలంటే టికెట్ కొనాల్సిందే.
న్యూస్ లైన్ డెస్క్ : మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు నేపథ్యంలో రాష్ట్రంలో రవాణా సమస్యపై తెలంగాణ ఆర్టీసీ స్పందించింది. ఈ మేరకు కొత్తగా రెండు కేటగిరీల్లో బస్సులను ఆర్టీసీ అందుబాటులోకి తీసుకురానుంది. తెలంగాణలోని ప్రధాన పట్టణాల మధ్య సెమీ డీలక్స్ బస్సులు, మెట్రో డీలక్స్ బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఈ బస్సులు ఇప్పటికే రాష్ట్రంలోని పలు డిపోలకు బస్సులు చేరాయి. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది.
మహిళలకు నో ఎంట్రీ..
ఇప్పటికే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలులో ఉంది. అయితే.. ప్రభుత్వం కొత్తగా తేనున్న సెమీ డీలక్స్, మెట్రో డీలక్స్ బస్సుల్లో ప్రయాణించాలంటే టికెట్ కొనాల్సిందే. కేవలం ఆర్టీసీ ఎక్స్ ప్రెస్, ఆర్డినరీ బస్సులు, పల్లెవెలుగు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పించింది. అయితే కొత్తగా తీసుకొచ్చే బస్సుల్లో మాత్రం మహిళలకు ఉచిత సదుపాయం లేదు.
బకాయిలు చెల్లించకనే..
మహిళలకు ఉచిత బస్సు పథకం పెట్టిన తర్వాత ఆర్టీసీ బస్సులకు మహిళల్లో ఆదరణ బాగా పెరిగింది. అయితే.. ప్రభుత్వం చెల్లించాల్సిన రియంబర్స్ మెంట్ బకాయి పడటంతో ఆర్టీసీ ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషిస్తోంది. ఈ క్రమంలోనే కొత్త కేటగిరీ బస్సులను రోడ్డెక్కించనుంది. ప్రస్త్తం ఆర్టీసీలో సూపర్ లగ్జరీ, ఎక్స్ ప్రెస్ డీలక్స్, పల్లె వెలుగు, గరుడ బస్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఆర్టీసీకి ఎక్స్ ప్రెస్ బస్సులు మాత్రమే ఆదాయాన్ని తెచ్చి పెడుతున్నాయి.