భారత్ లో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయా? కేంద్రం పెట్టిన రూల్స్ కి మెటా ఒప్పుకోలేదా?
న్యూస్ లైన్ డెస్క్: భారత్ లో వాట్సాప్ సేవలపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో వాట్సాప్ సేవలు నిలిపివేసే ఆలోచన మెటా సంస్థకు లేదని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా దేశంలో వాట్సాప్ సేవలు నిలిచిపోతాయా? అని కాంగ్రెస్ ఎంపీ వివేక్ తంఖా ప్రశ్నించారు. సర్వీసుల నిలిపివేతపై తమకు ఎలాంటి ప్రతిపాదనలు ఇవ్వలేదని వైష్ణవ్ బదులిచ్చారు. కాగా వాట్సాప్ లో ఎన్ క్రిప్షన్ పద్ధతి తొలగించాలని కేంద్రం ప్రతిపాదిస్తే తాము భారత్లో సేవలు నిలిపివేస్తామని మెటా గతంలో వ్యాఖ్యానించింది. కాగా తాజాగా కాంగ్రెస్ ఎంపీ ప్రశ్నకు కేంద్రం పై విధంగా స్పందించారు.