ఈ మూవీ నుంచి ‘సవదీక’ అనే ఫాస్ట్ బీట్ ఎనర్జిటిక్ సాంగ్‌ను మేకర్స్ ఈ రోజు విడుదల చేశారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: అగ్రకథానాయకుడు అజిత్ కుమార్ , లైకా ప్రొడక్షన్స్ కలయికలో మగిళ్ తిరుమేని డైరక్షన్ లో రూపొందుతున్న ఈ మూవీ విడాముయర్చి ఈ సినిమా వచ్చే 2025 సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. అయితే ఈ సినిమా తమిళ్ , తెలుగు జనాలకు మంచి అంచనాలున్నాయి.
రీసెంట్‌గా విడుదలైన విడాముయర్చి సినిమా టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ మూవీ నుంచి ‘సవదీక’ అనే ఫాస్ట్ బీట్ ఎనర్జిటిక్ సాంగ్‌ను మేకర్స్ ఈ రోజు విడుదల చేశారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఆంథోని దాసన్ పాడిన ఈ పాటను అరివు రాశారు
ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ ఫ్లిక్స్ తీసుకుంది. అజిత్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో ‘మంగాత " ల అజిత్ కుమార్, త్రిష, యాక్షన్ కింగ్ అర్జున్ త్రయం తమదైన నటనతో ప్రేక్షకులను అలరించారు. ఈ మూవీ లో మరోసారి వీరు ముగ్గురు ఆడియెన్స్ ను మెప్పించనున్నారు. అలాగే విడాముయర్చిలో ఆరవ్, రెజీనా కసాండ్ర, నిఖిల్ ఉన్నారు.