" విరాజి" ఓటీటీ రిలీజ్ అయ్యింది. ఆగష్టు 2 న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. థియేటర్ లో అంతగా ఆడలేదు.
న్యూస్ లైన్, స్పె షల్ డెస్క్: అసలు వరుణ్ కు ప్రేమకథతోనే హిట్టు పడింది. ఆల్రెడీ తనకు లవర్ బాయ్ ఇమేజ్ ఉంటుంది. అయితే రీసెంట్ గా వచ్చిన " విరాజి" ఓటీటీ రిలీజ్ అయ్యింది. ఆగష్టు 2 న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. థియేటర్ లో అంతగా ఆడలేదు.
ఒకరితో ఒకరికి పరిచయం లేకుండా.. ఓ వ్యక్తి ఫోన్ కాల్ వల్ల డాక్టర్, స్టాండప్ కమెడియన్, ప్రొడ్యూసర్, ఫొటోగ్రాఫర్, ప్రముఖ జోష్యుడు, పోలీస్ అధికారి అందరు ఓ పాడుబడ్డ బంగ్లాకి వస్తారు. ఆ పాడుబడ్డ బంగ్లా మెల్లగా పిచ్చాసుపత్రి అని గుర్తిస్తారు. నీకు ఇది చివరి రోజు అని కూడా ఓ కార్డుపై రాసిపెట్టి ఉంటుంది. చెప్పనట్లుగానే గ్యాంగ్ లో ఒకొక్కరు చనిపోతుంటారు. ఇలాంటి టైంలో డ్రగ్స్ కు బానసైన వరుణ్ ఆ బంగ్లాలోకి అడుగుపెడతాడు..అసలు ఎవరు చంపేస్తున్నారు...వరుణ్ ఎందుకు ఆ టైంలో ఆ బంగ్లాకు చేరుకున్నాడు ఇదేస్టోరీ.
చెన్నైలో చోటు చేసుకున్న కొన్ని యదార్థ సంఘటన ఆధారంగా డైరెక్టర్ ఆద్యంత్ హర్ష ఈ కథను తెరకెక్కించాడు. అతను తీసుకున్న పాయింట్ చాలా ఇంట్రస్టింగ్ . ఎస్టాబ్లిస్ చేయడంలో మాత్రం చాలా తడబడ్డాడనే చెప్పాలి. ఒక్కో పాత్రను పరిచయం చేయడానికి ఎక్కువ సమయం తీసుకోవడంతో.. కాస్త బోరింగ్ గా అనిపిస్తుంది. హీరోనే చేస్తున్నాడనే యాంగిల్ చాలా బాగుంది.హీరో ఎంట్రీతో కథ టర్న్ అవుతుంది. సెకండాఫ్ లో వరుణ్ సందేశ్ నేపథ్యంలో వచ్చే సీన్లు ప్రేక్షకులను మెప్పిస్తాయి. క్లైమాక్స్ చాలా బాగుంది. అయితే చాలా చాలా స్లోగా ఉంటుంది అంతే.
డ్రగ్స్ కు బానిసైన వ్యక్తిగా వరుణ్ సందేశ్ అద్భుతమైన నటనతో మెప్పించాడు. సినిమాకు ఇతడి నటనే హైలెట్. ఇక మిగతా వారిలో రఘు కారుమంచి, ప్రమోదిని, కుషాలిని, బలగం జయరాం తమ పాత్రల పరిధిమేరకు నటించారు.మ్యూజిక్ ఓకే ఓకే . డైరక్షన్ సూపర్ ఎగ్జిక్యూషన్ వరస్ట్ . ఇంకాస్త బెటర్ ఎఫర్ట్స్ పెట్టి ఉంటే సినిమా సూపర్ ఉండేది.
సినిమాకు ప్లస్ పాయింట్స్ ఇవే..
వరుణ్ సందేశ్ నటన
సెకండాఫ్
ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్
బలహీనతలు
పాత్రలు ఎక్కువ కావడం
కొన్ని బోరింగ్ సీన్స్