Mirabai Chanu: పీరియడ్స్‌లో కూడా 199 కిలోల బరువు మోసింది.. కానీ..

గాయంతో పాటు పీరియడ్స్ రావడంతో బలహీనంగా మారానని ఆమె తెలిపారు. దీంతో మీరాబాయి విజయం ప్రయత్నం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా అయితే ఆడవారు అనగానే ముస్కులారిటీ అనే అంశంలో చాలా సున్నితంగా చూసుకుంటారు. 


Published Aug 08, 2024 04:37:44 AM
postImages/2024-08-08/1723109814_meera.jpg

న్యూస్ లైన్ డెస్క్: 2024 పారిస్ ఒలింపిక్స్‌లో గురువారం జరిగిన మహిళల 49 కేజీల వెయిట్‌లిఫ్టింగ్‌లో ఇండియన్ ప్లేయర్ సైఖోమ్ మీరాబాయి చాను నాలుగో స్థానంలో నిలిచింది. ఈ ఈవెంట్‌లో 199 కేజీల బరువు ఎత్తి నాలుగో స్థానంలో ముగించింది. స్నాచ్‌లో 85 కేజీల లిఫ్ట్‌తో ప్రారంభించి.. మూడో ప్రయత్నంలో 88 కేజీల బరువును ఎత్తింది. మెడల్ ఈవెంట్‌లో మీరాబాయి చాను మొత్తం 199 కిలోల (88 + 111)తో తన గేమ్ ముగించి నాలుగో స్థానంలో నిలిచింది. ఈ ఇవేంట్‌లో 206 కేజీలు ఎత్తిన చైనాకు చెందిన హౌ జిహుయ్ బంగారు పతాకాన్ని సొంతం చేసుకుంది.

అయితే, స్వర్ణ పథకాన్ని సొంతం చేసుకోలేక పోయినప్పటికీ కూడా మీరాబాయి నిరాశ చెందలేదు. తాను చేసిన ప్రయత్నం పట్ల చాలా సంతోషంగా ఉన్నానని ఆమె తెలిపారు. ఆటగాళ్లు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆమె వెల్లడించారు. ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో గాయాలను ఎదుర్కొన్నానని ఆమె అన్నారు. రియోలో పతకం సాధించడంలో విఫలమైనా, ఆ తర్వాత ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించానని తెలిపారు. ఈసారి కూడా పతకం సాధించేందుకు నా వంతు ప్రయత్నం చేశానని అన్నారు. 

మీరాబాయి ఓ సెట్‌లో 111 కేజీల బరువును, పారిస్ ఒలింపిక్స్‌లో మొత్తం 199 కేజీల ఎత్తి నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో పతకాన్ని కోల్పోయారు. అయితే, గాయంతో పాటు పీరియడ్స్ రావడంతో బలహీనంగా మారానని ఆమె తెలిపారు. దీంతో మీరాబాయి విజయం ప్రయత్నం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.అయితే, మస్క్యూలరిటీ విషయంలో మగవారితో పోలిస్తే ఆడవారిని చాలా సున్నితంగా భావిస్తారు. కానీ, ఓ వైపు గాయం మరోవైపు పీరియడ్స్ ఉన్నప్పటికీ 199 కేజీల బరువు మోసి మీరా ఆడవారు తలుచుకుంటే బరువులు కూడా లెక్క కాదని ప్రూవ్ చేశారు. 


 

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu paris-olympic parisolympics saikhom-mirabai-chanu indian-weightlifter

Related Articles