Woman Doctor: ముంబై ఆసుపత్రిలో మహిళా వైద్యురాలిపై దాడి

ముంబైలోని సియోన్ ఆసుపత్రిలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.


Published Aug 18, 2024 04:31:00 PM
postImages/2024-08-18/1723978957_processaws.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కోలకత్తా లేడీ డాక్టర్ ఇన్సిడెంట్ ఇంకా మరిచిపోయేలోపే.. ముంబై లో మరో లేడీ డాక్టర్ పై దాడి జరిగింది. పేషెంట్ తో సహా మరో ఐదుగురు కుర్రాళ్లు డ్యూటీ డాక్టర్ పై దాడులు జరిపారు. ఈ ఘటనలో డాక్టర్ కు స్వల్ప గాయాలయ్యాయి. ముంబైలోని సియోన్ ఆసుపత్రిలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.

పేషెంట్ తో సహా అందరూ మద్యం మత్తులో ఉన్నారని, డాక్టర్ ను తిడుతూ గొడవ చేశారని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. ఆ ఇన్సిడెంట్ లో మరో వ్యక్తి సాయం చేసే లోపే ..ఆ కుర్రాళ్లు అక్కడ నుంచి తప్పించుకున్నారని అన్నారు.
ముంబైలోని సియోన్ ఆసుపత్రికి ఆదివారం తెల్లవారుజామున ఓ వ్యక్తి ముఖంపై గాయాలతో రక్తమోడుతూ వచ్చాడు. ఆయనతో ఐదారుగురు వ్యక్తులు తోడుగా వచ్చారు. వారంతా మద్యం మత్తులో ఉన్నారు. వార్డులో విధులు నిర్వర్తిస్తున్న రెసిడెంట్ డాక్టర్ ఈ పేషెంట్ ను అటెండ్ అయ్యారు. 


ఆ వ్యక్తి లేడీ డాక్టర్ వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు . గాయాలకు చికిత్స చేస్తుండగా పేషెంట్ తిట్లదండకం మొదలు పెట్టాడు. ఆపై మహిళా వైద్యురాలిపై దాడి చేశారు. ఈ దాడిలో వైద్యురాలికి గాయాలయ్యాయి. వైద్యురాలి కేకలతో సెక్యూరిటీ సిబ్బంది అక్కడికి చేరుకునేలోగా నిందితులు అందరూ పారిపోయారు. ఈ ఘటనపై సియోన్ హాస్పటిల్ డీన్ రియాక్ట్ అయ్యారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఆ కుర్రాళ్లపై పోలీసులకు కంప్లైయింట్ చేస్తామని తెలిపారు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu doctors attack mumbai

Related Articles