జైపూర్ లేడీ బిజినెస్ వుమెన్స్ అంతా కలిసి తృప్తిని బ్యాన్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు తృప్తి పాపతో వాళ్లకేం గొడవొచ్చిందో చూద్దాం.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: పాపం యానిమల్ బ్యూటీ తృప్తి డిమ్రి ఇప్పుడిప్పుడే అటు బాలీవుడ్ లోను...ఇటు టాలీవుడ్ లోను సినిమా సంతకాలు చేస్తుంది. అప్పుడే వివాదాల్లో ముగినితేలుతుంది. జైపూర్ లేడీ బిజినెస్ వుమెన్స్ అంతా కలిసి తృప్తిని బ్యాన్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు తృప్తి పాపతో వాళ్లకేం గొడవొచ్చిందో చూద్దాం.
జైపూర్ లోని మహిళా పారిశ్రామక వేత్తల ఆగ్రహానికి గురింది. వాళ్లంతా ఆమె సినిమాలు జైపూర్ లో రిలీజ్ చేయటానికి వీల్లేదని, ఆమెను బాయ్ కాట్ చేయాలని పిలుపు ఇచ్చారు. ఆ మేరకు ఓ వీడియోని వాళ్లు రిలీజ్ చేస్తే అది అంతటా వైరల్ అయ్యింది. జైపూర్ కు చెందిన కొందరు మహిళా పారిశ్రామిక వేత్తలు ఆమెను మంగళవారం జరిగిన FICCI FLO ఈవెంట్ కు గెస్ట్ గా పిల్చారు. అందుకోసం ఆమెకు ఐదున్నర లక్షలు కు డీల్ కుదుర్చుకున్నారు. సగం డబ్బును అడ్వాన్స్ కూడా ఇచ్చారు. కాని ఏం చేస్తాం. ఆవిడకి ఫ్లైట్ మిస్స్ అయ్యింది. ఇక చేసేది లేక ఈవెంట్ మిస్ చేసుకుంది.
మహిళా పారిశ్రామిక వేత్తలు కు ఈ విషయంలో చాలా ఆగ్రహం వచ్చింది. రానంటే మొదటే చెప్తే వేరే వాళ్లను చూసుకుందుము కదా.ఇలా చేస్తుందా, మా టైమ్, డబ్బు వేస్ట్ చేసిందని ఆమెను బోయ్ కాట్ చేయాలని పిలుపు ఇచ్చారు. మా ఈ వెంట్ ను చెడగొట్టింది ..ఇకపై జైపూర్ లో నీ సినిమాలు ఎలా ఆడతాయో చూస్తానంటు శపథాలు చేస్తున్నారు. మామూలుగా అయితే తృప్తి షెడ్యూల్ ప్రకారం జైపూర్ బయిలుదేరింది. కానీ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి ప్లైట్ ని క్యాచ్ చేయలేక పోయింది. దాంతో ఈవెంట్ మిస్సైంది. ఆ విషయం వాళ్లు ఎవ్వరు ఫాలో అప్ కూడా చెయ్యలేదు. అందుకే మేం కూడా ఏం చెప్పలేదు అంటున్నారు తృప్తి టీం.
ఆషికీ 3 సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. త్వరలోనే ఇతర నటీనటులు, టెక్నిషియన్ల గురించి మేకర్స్ ప్రకటించనున్నారు. విజయ్ తో భూల్ భులయ్య 3 సినిమాలో కూడా ఈ బ్యూటీనే హీరోయిన్ రెమ్యూనిరేషన్ కూడా కోటి రూపాయిలు.