విక్రమార్కుడు , యమదొంగ మరియు మర్యాద రామన్నా సినిమాల్లో నటించాడు. ఈ బాల నటుడు ..ఎవరో కాదు రాజమౌళి అన్నగారైన కీరవాణి కుమారుడు శ్రీ సింహా.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: రాజమౌళి ప్రతి సినిమాలో ఓ చైల్డ్ ఆర్టిస్ట్ కనిపించేవాడు. ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఓ టాప్ మ్యూజిక్ డైరక్టర్ కొడుకు , ఇప్పుడు మంచి హీరో కూడా అయ్యాడు. ఏంటి ఇంకా గుర్తు రాలేదా...విక్రమార్కుడు , యమదొంగ మరియు మర్యాద రామన్నా సినిమాల్లో నటించాడు. ఈ బాల నటుడు ..ఎవరో కాదు రాజమౌళి అన్నగారైన కీరవాణి కుమారుడు శ్రీ సింహా.
*విక్రమార్కుడు లో మార్వాడి పెళ్లి ఇంట్లో చాలా మంది పిల్లలు అల్లరి చేస్తుంటార. అందులో శ్రీసింహా ఒకరు.
* ఆ తరువాత ఎన్టీఆర్ హీరోగా వచ్చిన యమదొంగ చిత్రంలో ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్ర చేశాడు. లిటిల్ దొంగగా శ్రీ సింహ నటన ఆ చిత్రంలో ఆకట్టుకుంది.
*ఆ తరువాత సునీల్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన మర్యాద రామన్న చిత్రంలో కూడా శ్రీ సింహ మెరిశాడు. నాగినీడు ఇంటికి దారిచూపే రాయలసీమ కుర్రాడిగా శ్రీసింహ కనిపించారు.
ఈ క్యారక్టర్లలో ఉన్నది శ్రీసింహా అన్నది పెద్ద గా గుర్తుపట్టలేం. ఇప్పుడు సూపర్ స్మార్ట్ అయ్యాడు. మత్తువదలరా మూవీతో శ్రీ సింహ హీరోగా మారాడు. అరంగేట్రమే ఓ డిఫరెంట్ మూవీలో నటించి శభాష్ అనిపించాడు. ఇప్పుడు పార్ట్ 2 తో సూపర్ డూపర్ హిట్టు కొట్టాడు. సో శ్రీసింహా బాలనటుడు కమ్ నటుడు . కీరవాణి మరో కొడుకు కాలభైరవ మ్యూజిక్ డైరక్టర్ గా రాణిస్తున్నారు.