YS Jagan: త‌ల్లితో క‌లిసి క్రిస్మ‌స్ వేడుక‌ల్లో పాల్గొన్న వైఎస్ జ‌గ‌న్‌ !

ఆయన తల్లి చెయ్యి పట్టుకొని కేక్ కట్ చేస్తున్న పిక్ ఫుల్ వైరల్ అవుతుంది. కుమారిడిని దగ్గరకు తీసుకొని తల్లి విజయమ్మ ఆప్యాయంగా ముద్దు పెట్టారు.


Published Dec 25, 2024 03:27:00 PM
postImages/2024-12-25/1735120712_YSJaganChristmasCelebrationWithYSVijayammaatCSIChurchPulivendula1.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : ఏపీ మాజీ సీఎం , వైసీపీ  అధినేత వైఎస్ జగన్ నాలుగు రోజుల కడప జిల్లా పర్యటనలో భాగంగా ఈ రోజు పులివెందుల సీఎస్ ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో తల్లి వైఎస్ విజయమ్మ తో కలిసి పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ఆయన తల్లి చెయ్యి పట్టుకొని కేక్ కట్ చేస్తున్న పిక్ ఫుల్ వైరల్ అవుతుంది. కుమారిడిని దగ్గరకు తీసుకొని తల్లి విజయమ్మ ఆప్యాయంగా ముద్దు పెట్టారు.


దీనికి ముందు క్రిస్మస్ వేడుకల కోసం చర్చికి చేరుకున్న జగన్ కు పార్టీనేతలు , కార్యకర్తలు అభిమానులు ఘనస్వాగతం పలికారు. అంతేకాదు ఇక ఇడుపుల పాయ ప్రేయర్ హాల్ లో జరిగిన ప్రత్యేక ప్రార్ధనల్లో జగన్ , విజయమ్మ తో పాటు కుటుంబసభ్యులు కూడా పాల్గొన్నారు. గురు శుక్రవారం కూడా మాజీ సీఎం కడప జిల్లాలో పర్యటించనున్నారు.  అంతేకాదు క్రిస్మస్ వేడుకల్లో భాగంగా కొత్త సంవత్సరం క్యాలండర్ ను జగన్ ఆవిష్కరించారు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu ysjagan mother

Related Articles