దేశంలో తెలంగాణ పోలీసులకు బెస్ట్ పోలీసింగ్ అనే మంచి పేరుంది ఉందని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్, తెలంగాణ రాష్ట్ర మాజీ రెడ్‌కో ఛైర్మన్ వై. సతీష్ రెడ్డి అన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: దేశంలో తెలంగాణ పోలీసులకు బెస్ట్ పోలీసింగ్ అనే మంచి పేరుంది ఉందని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్, తెలంగాణ రాష్ట్ర మాజీ రెడ్‌కో ఛైర్మన్ వై. సతీష్ రెడ్డి అన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరి అదేశాలతో, ఎందుకు మీరు చేస్తున్నారో తెలియడం లేదన్నారు. సరైన ఆధారాలు లేకుండా, సరైన సమాచారం లేకుండా అరెస్ట్ చేయడం సరికాదని తెలిపారు. అరెస్టు చేసిన తరువాత అబాసు పాలు కావడం పరిపాటిగా మారింది అనే చర్చ జరుగుతుందని ఆయన అన్నారు. అందులోనూ బీఆర్ఎస్ నాయకుల విషయంలో ఇది మరీ ఎక్కువగా ఉందని తెలిపారు. తప్పుడు ఆరోపణలతో అరెస్ట్ చేయడం, వాటిని నిరూపించ లేకపోవడం సర్వ సాధారణంగా మారిందన్నారు. ఇలా రాజకీయ కక్షల కోసం తెలంగాణ పోలీసులు పనిచేస్తున్నారు అనే అపవాదు తెలంగాణ పోలీసులు తెచ్చుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ డీజీపీ జితేందర్ రెడ్డి, తెలంగాణ పోలీస్ ఇకనైనా ఇలాంటివి ప్రోత్సహించకుండా ఉంటారని ఆశిస్తున్నామని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అనేది 60లక్షల సభ్యులు కలిగిన అతి పెద్ద కుటుంబం అని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలో అయినా ఏ సభ్యునికి ఏమైనా అవసరాన్ని బట్టి కుటుంబం మొత్తం కదిలి వస్తదని ఇప్పటికే పలు సందర్భాల్లో రుజువైందని సతీస్ రెడ్డి పేర్కొన్నారు.