ఓ వ్యక్తి చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని రోడ్డు దాటుతుండగా.. వేగంగా దూసుకొచ్చిన స్కూల్ బస్సు అతడిని ఢీకొట్టింది.
న్యూస్ లైన్ డెస్క్ : రోడ్డు దాటుతున్నప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు పాటించకపోతే ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది. చిన్నపాటి నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు బలవుతాయి. ఇలాంటి ఘటనే.. ఢిల్లీలో జరిగింది. ఓ వ్యక్తి చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని రోడ్డు దాటుతుండగా.. వేగంగా దూసుకొచ్చిన స్కూల్ బస్సు అతడిని ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
యూపీలోని ఆగ్రాకు చెందిన మనోజ్ కుమార్ ఢిల్లీలోని రంగపురిలో నివసిస్తున్నాడు. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. డ్యూటీ ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వెళ్తున్నాడు. రోడ్డు దాటుతున్న సమయంలో అటుగా వేగంగా దూసుకొచ్చిన స్కూల్ బస్సు హారన్ సౌండ్ వినలేకపోయాడు. దీంతో వేగంగా వచ్చిన బస్సు మనోజ్ కుమార్ ని ఢీకొట్టింది. దీంతో మనోజ్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్కూల్ బస్సు ఢీకొట్టి వెళ్లిపోతుండగా స్థానికులు బస్సు డ్రైవర్ ను పట్టకుని పోలీసులకు అప్పగించారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.