హిందూ క్యాలెండర్‌లో శుక్ల పక్షం, కృష్ణ పక్షం ఉన్నంహిందూ క్యాలెండర్‌లో శుక్ల పక్షం, కృష్ణ పక్షం ఉన్నందున మిగిలిన పన్నెండు కూడా వాటినే సూచిస్తాయి.దున మిగిలిన పన్నెండు కూడా వాటినే సూచిస్తాయి.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : సూర్యుని గుడి అనగానే ..కోణార్క్ టెంపుల్ పేరు చెప్తారు. కాని కోణార్క్ కంటే పురాతన దేవాలయం అరసవెల్లి దేవాలయం . నిజానికి కోణార్క్ టెంపుల్ సూర్య భగవానుడి రథం ఆకారంలో నిర్మించారు. ఈ రథానికి 24 చక్రాలు ఉన్నాయి. 7 గుర్రాలు లాగుతున్నట్లు కనిపిస్తాయి. ఏడు గుర్రాలు వారంలోని ఏడు రోజులను సూచిస్తాయి. 24 చక్రాలు రోజులోని 24 గంటలను సూచిస్తాయి. హిందూ క్యాలెండర్‌లో శుక్ల పక్షం, కృష్ణ పక్షం ఉన్నందున మిగిలిన పన్నెండు కూడా వాటినే సూచిస్తాయి.
సూర్య భగవానుడి విగ్రహం పూరీ జగన్నాథ ఆలయంలో భద్రంగా ఉంది. ఫలితంగా ఈ ఆలయంలో దేవత విగ్రహం లేదు. అదే అరసవెల్లిలో స్వామి వారి పాదాల చెంతకు ప్రతి యేడాది రెండు సార్లు సూర్యుని కిరణాలు గర్భగుడిలో మూల విరాట్టు పాదాలను తాకేలా ఈ ఆలయాన్ని నిర్మించారు.. ఈ దృశ్యం భక్తుల్లో ఆనంద పారవశ్యాన్ని, ఆధ్యాత్మికతను నింపుతుంది. ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు భక్తులు అశేషంగా తరలివస్తారు.
దేవస్థానం ప్రాంగణంలోని అనివెట్టి మండపం, సుదర్శన ద్వారం మధ్యలో సూర్యుని తొలికిరణాలు గర్భగుడిలో ఉన్న మూలవిరాట్టును తాకి గొప్ప తేజస్సును అందిస్తాయి. ప్రతి సంవత్సరం మార్చి 9, 10, 11, 12 తారీఖుల్లో, అక్టోబర్ 1, 2, 3, 4 తారీఖుల్లో ఈ అద్భుతం ఆవిష్కృతమవుతుంది. ఈ అపురూపమైన దృశ్యాన్ని తిలకిస్తే అన్నీ పాపాలు తొలగిపోతాయనే నమ్మకం ఉంది. అంతేకాదు అరసవెల్లి స్వామి వారి అభిషేకం నీరును తాగితే ఎలాంటి రోగాలు ఉండవని భక్తులు నమ్మకం.