ఇక ఈ చిత్రం 2025 మార్చి 28న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే చెప్పేశారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా 'హరిహర వీరమల్లు'. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీ కోసం పవన్ అభమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్రం 2025 మార్చి 28న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే చెప్పేశారు.
అయితే మేకర్స్ సోమవారం సినిమా నుంచి ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో విలన్ పాత్రలో చేస్తున్న నటుడు బాబీ డియోల్ పుట్టిన రోజు సంధర్భంగా ఆయనకు బర్త్ డే విషెస్ చెప్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పోస్టర్ లో బాబీ చూడగానే ఆకట్టుకునేలా కత్తి పట్టుకొని గంభీరంగా కనిపిస్తున్నారు.
ఈ చిత్రం నుంచి ఇటీవలే పవర్‌స్టార్ స్వయంగా ఆలపించిన 'మాట వినాలి' అంటూ సాగే పాటను విడుదల చేశారు మేకర్స్. ఈ సాంగ్ ను ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీలో పవన్ తో నిధి అగర్వాల్ నటిస్తున్నారు.