కొందరికి వెంటిలేటర్ సాయంతో అత్యవసర చికిత్స చేయాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. అయితే ఇది అంటు వ్యాధి కాదు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : దేశంలో మరో కొత్త వ్యాధి కలకలం రేపుతుంది. నిజానికి ఇదేం కొత్త జబ్బు ఏం కాదు. మహారాష్ట్రలోని పుణె, పరిసర ప్రాంతాల్లో ఇటీవల గులియన్-బారీ సిండ్రోమ్ వేగంగా వ్యాపిస్తోంది. వారంలోనే 100కి పైగా మంది దీని బారినపడగా.. కొందరికి వెంటిలేటర్ సాయంతో అత్యవసర చికిత్స చేయాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. అయితే ఇది అంటు వ్యాధి కాదు. ఈ వ్యాధి లక్షణాలు కారణాలు , చికిత్స గురించి తెలుసుకుందాం.
గులియన్ బారీ సిండ్రోమ్‌ను ఒకరకంగా పరోక్ష జబ్బు, మరో రకం పక్షవాతమనీ చెప్పుకోవచ్చు. అయితే ఈ యాంటీ బాడీలు పొరపాటున కొందరిలో వారి కణజాలాన్నే శత్రువుగా భావించి దాడి చేస్తాయి. దీని వల్ల సొరియాసిస్, ల్యూపస్ వంటి స్వీయరోగనిరోధక (ఆటోఇమ్యూన్) వ్యాధులు వస్తాయి. గులియన్ బారీ సిండ్రోమ్ సమస్య కూడా ఇలానే వ్యాపిస్తుంది. వెన్నుముఖ నుంచి కాళ్లు, చేతుల వంటి భాగాలకు వెళ్లే నరాలపై ఇవి దాడ చేస్తాయి.
* చేతులు, ఛాతీ, మెడ, ముఖం వంటి భాగాలకు విస్తరిస్తుంది.
* కండరాల బలహీనత పక్షవాతంగానూ మారుతుందని వివరిస్తున్నారు.
* వేళ్లు, మణికట్టు లేదా మడమల వద్ద సూదులు పొడుస్తున్నట్టు అనిపించడం.
* సరిగ్గా నడవలేకపోవటం, మెట్లు ఎక్కలేకపోవటం, నడుస్తున్నప్పుడు తూలటం.
* ఈ బ్యాక్టీరియా, వైరస్‌ల వ్యాప్తికి బాధితుల మలంతో కలుషితమైన నీరు, ఆహారమే ప్రధాన కారణమని వివరిస్తున్నారు. బయట భోజనానికి చాలా దూరంగా ఉండాలి. జాగ్రత్తలు తప్పనిసరి .