మార్గశిర మాసంలో వచ్చే బహుశ ఏకాదశిని సఫల ఏకాదశి జరుపుకుంటారు. ఈ సఫల ఏకాదశిని ఎందుకు చేసుకుంటారో తెలుసుకుందాం.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: హిందూమతంలో శ్రీమహావిష్ణువు కు ప్రత్యేకస్థానం. సమస్త చరాచరజీవులకు శ్రీమహావిష్ణువే దిక్కని ప్రతి హిందువు నమ్ముతారు. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశులు ముఖ్యమైనవే. ప్రతి ఏకాదశికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో వచ్చే బహుశ ఏకాదశిని సఫల ఏకాదశి జరుపుకుంటారు. ఈ సఫల ఏకాదశిని ఎందుకు చేసుకుంటారో తెలుసుకుందాం.
ఏడాదిలో మొత్తం 24 ఏకాదశి తిథిలు ఉంటాయి. పురాణ గ్రంథాలలో ఏకాదశి తిథి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించబడింది. మార్గశిరమాసం ఏకాదశిని సఫల ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి...కొంత ధనాన్ని కాని కొంత భోజనాన్ని కాని దానం చేస్తే సిరి సంపదలకు లోటు ఉండదని హిందువులు నమ్మకం. ప్రతి ఏకాదశికి దాని సొంత పేరు, ప్రాముఖ్యత ఉంది. మార్గశిర మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశి రోజున జరుపుకుంటారు.
2024 సంవత్సరంలో, ఈ ఏకాదశి 26 డిసెంబర్ 2024 న జరుపుకుంటారు. సఫల ఏకాదశి ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం 2024 సంవత్సరంలో చివరి ఏకాదశి అవుతుంది. డిసెంబర్ 25న రాత్రి 10:29 గంటలకు ప్రారంభమై 26 డిసెంబర్ 2024న మధ్యాహ్నం 12:43 గంటలకు ముగుస్తుంది.
*సఫల ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలు నశించి మోక్షం లభిస్తుంది.
*ఉపవాసం రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి.
* విష్ణువును పూజించాలి. పండ్లు, పుష్పాలను సమర్పించండి.
* రోజంతా పండ్లు తినాలి. రాత్రి మేల్కొని జాగారం చేయాలి
* నిరుపేదలకు దానం చేయండి. పేదలకు ఆహారం అందించండి. ఇలా చెయ్యడం వల్ల చాలా రోజులుగా పెండింగ్ ఉన్న పనులు అవ్వాలంటే ఈ రోజు దానధర్మాలు చెయ్యడం మంచిదంటున్నారు పండితులు.