Pushpa: జనవరి 30 న ఓటీటీలోకి అల్లు అర్జున్ పుష్ప-2 సినిమా !

ఆ తర్వాత మరో 20 నిమిషాల సన్నివేశాలను జత చేశారు. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. 


Published Jan 27, 2025 06:29:00 PM
postImages/2025-01-27/1737982827_1952816pushpa2ottreleasedateallyouneedtoknow.webp

న్యూస్ లైన్ , డెస్క్:  అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన పుష్ప2 ది రూల్ సినిమా త్వరలో ఓటీటీలోకి రానుంది. జనవరి 30 నుంచి నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానుంది. గతేడాది డిసెంబర్ 5 న ఈ సినిమా 3 గంటల 20 నిమిషాల టైంలైన్ తో రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత మరో 20 నిమిషాల సన్నివేశాలను జత చేశారు. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. 


నార్త్‌ ఇండియాలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోల సినిమాలకు సైతం సాధ్యం కానీ వసూళ్లను రాబడుతూ 10 రోజుల్లోనే రూ.1292 కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది. రికార్డు బ్రేకింగ్ కలక్షన్స్ . చిత్ర యూనిట్‌ సభ్యులు 10 రోజుల సినిమా వసూళ్లను అధికారికంగా ప్రకటించారు. మైత్రి మూవీ మేకర్స్ వారి అధికారిక ప్రకటన ప్రకారం మొదటి 10 రోజుల్లో రూ.1292 కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయి. పుష్ప 2 అదే జోరును కంటిన్యూ చేస్తూ రూ.1300 కోట్ల వైపు దూసుకు వెళ్తుంది. రెండో వారం పూర్తి అయ్యేప్పటికి ఈ సినిమా రూ.1400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయి.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu ott-movies pushpa2

Related Articles