దుర్యోధనుడుకి ద్రౌపదికి వస్త్రపహరణ అవమానమే సరైనదనే ఆలోచన ఎవరు కల్పించారో మాత్రం చాలా మందికి తెలీదు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మహాభారతాన్ని ఓ మత గ్రంధం గానో, దేవుడు పుస్తకంగానో చూస్తున్నాం. కానీ నిజానికి మహాభారతం ఓ పంచమవేదం. బాధ్యతల పట్టీలో పడి ..ధర్మం..న్యాయం మనిషి ఎలా బతకాలో మహాభారతం చెప్తుంది. జీవితం ఏ విషయానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో చెబుతుంది. విజయం ఎలా సాధిస్తే గర్వపడాలో ...మహాభారతం నేర్పిస్తుంది. అయితే మహాభారతం అనగానే చాలా మందికి ద్రౌపది మాత వస్త్రాపహరణం గురించి తెలుస్తుంది. మాట్లాడుకుంటారు. కాని దుర్యోధనుడుకి ద్రౌపదికి వస్త్రపహరణ అవమానమే సరైనదనే ఆలోచన ఎవరు కల్పించారో మాత్రం చాలా మందికి తెలీదు.
నిజానికి ఈ విషయం విన్నాక చాలా మందికి ఆశ్చర్యం గా అనిపించవచ్చు. కాని దుర్యోధనుడికి ఆ సలహా ఇచ్చింది మాత్రం కర్ణుడట. దుర్యోధనునికి మొదట నుంచి ద్రౌపది , పాండవులు నచ్చదని అందరికి తెలిసిందే కదా...అయితే ద్రౌపదికి జరిగే అవమానం పాండవులకు జరగాలనుకున్నాడు. అంటే ద్రౌపదికి గాయం అయితే పాండవుల కంట రక్తం చిందాలనే ఆలోచన మాత్రమే దుర్యోధనుడికి ఉందట. దీనికి ఆర్జ్యం పోస్తూ కర్ణుడు అందరి ముందు వస్త్రపహరణ చేస్తే ఆ అవమానం ద్రౌపదితో పాటు పాండవులకు కూడా జరుగుతుందనే సలహా ఇచ్చాడట. అందుకే కురుక్షేత్రంలో ధర్మం తప్పిన వారందరికి కృష్ణుడు శిక్ష విధించాడు.
అంతమంది మహా మహులలో ...ఈ చర్యను ధిక్కరించింది మాత్రం వికర్ణుడు ఒక్కడే. ఇతను ఎవరో కాదు దృతరాష్ట్రుడు తనయులు నూరుగురు కౌరవులలో ఒక్కడు. అయితే అన్న అన్యాయం చేస్తుంటే ఎదిరించిన ధీరుడు.. దుర్యోధనుని తప్పుని ఎదిరించి నిలబడిన ఒకే ఒక్కడు. కౌరవులు అన్యాయం చేస్తున్నారని తెలిసినా...వికర్ణుడు సోదరుడి వైపు నిలబడ్డాడు. ఇందులో ద్రోణాచార్యలు, భీష్ముడు, కర్ణడు, వికర్ణుడు, కృపాచార్యడు, అశ్వత్థామ వంటి యోధులంతా తన సరసన ఉన్నారంటూ దుర్యోధనుడు గర్వపడటం కనిపిస్తుంది. వికర్ణుడు ఎంత గొప్పవాడైనా అతను కౌరవుల పక్షాన పోరాడుతున్నాడు కాబట్టి మృత్యువు తప్పలేదు. కాని కర్ణుడు మరణానికి అతి పెద్ద కారణం మాత్రం అసలు కారణం ఈ సలహా ఇవ్వడమే.