Sabarimala: ఈ నెల 29 తో అయ్యప్ప స్వామి ఆలయం మూసివేత !

మకర విళక్కు సీజన్ కోసం డిసెంబరు 30న సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని తెరుస్తామని దేవస్థానం వర్గాలు వెల్లడించాయి.


Published Dec 27, 2024 06:05:00 PM
postImages/2024-12-27/1735303005_7d7f30d0f52cf5981e41607f7deef8fc1660977809616217original.avif

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: దేశంలోని సుప్రసిధ్ద పుణ్యక్షేత్రాల్లో ఒకటైన శబరిమల అయ్యప్ప ఆలయంలో మండలదీక్షలసీజన్ ముగుస్తుంది. నిన్న మధ్యాహ్నం మండల పూజ అనంతరం ఆలయం మూసివేశారు.  ఈ నెల 29 తో  ఆలయం మూసేస్తామని కేరళ ఆలయ అధికారులు తెలిపారు. తిరిగి మకర విళక్కు సీజన్ కోసం డిసెంబరు 30న సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని తెరుస్తామని దేవస్థానం వర్గాలు వెల్లడించాయి. వచ్చే యేడాది జనవరి 14న మకర విళక్కు పర్వదినం సందర్భంగా దాదాపు లక్షలాది మంది అయ్యప్ప భక్తులు శబరిమలకు తరలివస్తున్నారు. జ్యోతి దర్శనానికి చాలా మంది అయ్యప్ప భక్తులు శబరిమల చేరుకుంటారు.  ఈ ఏడాది అయ్యప్పస్వామిని 32,39,756 మంది దర్శించుకున్నారు. గతేడాది 28,42,447 మంది స్వామివారి దర్శనం చేసుకున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu bhakthi kerala

Related Articles