రీసెంట్ గా బ్రిటన్ లోని 200 కంపెనీ సంచలన నిర్ణయం తీసుకున్నాయి.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో పనిగంటల విషయంపై చాలా చర్చలు జరుగుతున్నాయి. కొందరు ఎక్కువ పనిగంటలు ఉండాలని చెబుతుంటే మరికొందరు మాత్రం పనిగంటల కంటే కూడా క్వాలిటీ టైం చాలా ముఖ్యం అని అంటుంటారు. రీసెంట్ గా బ్రిటన్ లోని 200 కంపెనీ సంచలన నిర్ణయం తీసుకున్నాయి.
ఎలాంటి శాలరీ కటింగ్ లేకుండా పర్మినెంట్గా నాలుగు పని దినాలను అమలు చేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ విధానంలోకి చాలా మార్కెటింగ్ , టెక్నాలజీ , ఛారిటీ లు సహా 200 సంస్థలు ఈ పని విధానాన్ని అమలు చేస్తున్నట్లు అనౌన్స్ చేశాయి . ఇప్పటికే ఫ్యామిలీ టైం చాలా తక్కువైందని ...ఫెర్టిలిటీ సమస్యలు ఎక్కువ కావడానికి పని ఒత్తిడి కూడా కారణమని చాలా సర్వేలు తెలిపాయి. దీని వల్ల సుమారు 5 వేల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని తెలిపాయి. 9 నుంచి 5 వరకు జాబ్ అనేవి వందేళ్ల కిందటి విధానాలు. ప్రస్తుత అవసరాలకు ఇవి సరిపోవు. .
ఇప్పుడు 24 ఐటీ, టెక్నాలజీ, 29 ఛారిటీలు, 22 మేనేజ్మెంట్, కన్సల్టింగ్ కంపెనీలు కూడా ఇదే విధానంలో చేరినట్లు తాజాగా సర్వేలో వెల్లడైంది. ఇక లండన్ లో 59 సంస్థలు ఈ కొతత విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిసింది.