hyderabad: వృద్దురాలిని చంపి శవంపై డాన్సులు వేసిన కుర్రాడు !

హైదరాబాద్ లోని కుషాయిగూడలో దారుణం జరిగింది. 70 ఏళ్ల వృద్దురాలిని అత్యంత కిరాతకంగా చంపి మృతదేహంపై డ్యాన్సులు వేస్తూ వీడియో తీసుకున్నాడు.


Published Apr 16, 2025 12:55:00 PM
postImages/2025-04-16/1744788687_452649kushaiguda.avif

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : రోజురోజుకు పిల్లలు చాలా వైల్డ్ గా ఉంటున్నారు. ఫోన్ ఎఫెక్టో...చుట్టు పెరిగే వాతావరణమో..పెంపకమో..ఫ్రెండ్సో ఒక్కటి కాదు ఎన్ని రీజన్స్ ఉన్నాయో తెలీదు కాని ..హ్యుమానిటీ , దయ , జాలి లాంటి వాటిని మరిచిపోతున్నారు. హైదరాబాద్ లోని కుషాయిగూడలో దారుణం జరిగింది. 70 ఏళ్ల వృద్దురాలిని అత్యంత కిరాతకంగా చంపి మృతదేహంపై డ్యాన్సులు వేస్తూ వీడియో తీసుకున్నాడు.


కృష్ణానగర్ కాలనీలో హత్యకు గురైన వృద్ధురాలు కమలమ్మ కేసులో వెలుగులోకి వచ్చిన విస్తుపోయే విషయమిది. పోలీసుల కథనం ప్రకారం.. కమలమ్మ ఓ ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. అయితే ఆమెకు రెండు షటర్లు ఉన్నాయి. వాటిని రాజస్థాన్ కు చెందిన ప్రకాశ్ చౌదరి , లలిత్ చౌదరికి అద్దెకిచ్చింది. రాజస్థాన్ కే చెందిన 17 ఏళ్ల బాలుడు  వీరి దగ్గర 8 నెలలుగా పనిచేస్తున్నాడు. 


అయితే కమలమ్మ ఎప్పుడు షాపులు సరిగ్గా చూసుకోవడం లేదని చిరాకు పడుతూ ఉండేది. దుకాణం నిర్వహణ విషయంలో బాలుడిని తరచూ కమలమ్మ మందలిస్తోంది. కనిపించినప్పుడల్లా కసురుకుంటోంది. దీంతో కోపం తో రగిలిపోయిన కుర్రాడు శుక్రవారం రాత్రి ఆమె ఇంట్లోకి చొరబడి ఆమె మెడకు చీరను బిగించి హత్య చేశాడు. ఆపై మృతదేహాన్ని ఎక్కి తొక్కాడు. అప్పటికీ అతడి కోపం చల్లారకపోవడంతో మెడను తొక్కుతూ డ్యాన్స్ చేశాడు. ఇలా డాన్సు చేస్తూ ఉన్న వీడియోను బెంగుళూరులో తన ఫ్రెండ్ కు పంపాడు. అక్కడ వైరల్ కావడంతో పోలీసులు విచారణ చేపట్టారు.
 

newsline-whatsapp-channel
Tags : viral-news boys womens- died murder

Related Articles