అగ్రరాజ్యం అమెరికాలో. ప్రస్తుతం అక్కడ కోడిగుడ్ల ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న ట్రంప్ టారిఫ్ ల వార్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా బంగారం రేటే కాదు కోడిగుడ్లు రేట్లు కూడా ఆకాశాన్ని అంటుకుంటున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో. ప్రస్తుతం అక్కడ కోడిగుడ్ల ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి.
2023 ఆగష్టు లో అమెరికాలో డజను కోడిగుడ్ల ధర 2.04 డాలర్లు కాని ప్రస్తుతం డజను గుడ్ల ధర 6.23 డాలర్లు చేరింది. ఇదే పరిస్థితి కాని కొనసాగితే ఈ ఏడాది చివరి నాటికి అక్కడ డజను కోడిగుడ్లు ధరలు మరో 50 శాతం పెరగవచ్చునని అంచనా వేస్తున్నారు. అంటే భారత కరెన్సీ లో డజన్ గుడ్లు రూ.1200 నుంచి రూ. 1300కు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
అమెరికాలో కోడి గుడ్ల ధరలు భారీగా పెరగడానికి బర్డ్ ఫ్లూ కారణం. ఇక్కడే కాదు అక్కడ కూడా గత కొన్ని నెలలు గా బర్డ్ ఫ్లూ ఉంది. బర్డ్ ఫ్లూ దెబ్బకు అమెరికా ఖండమంతా అతలాకుతలమవుతుంది. రెండు మూడేళ్లుగా కోట్లాది కోళ్లను హతమార్చాల్సి వచ్చింది. ఈ ఏడాది జనవరి - ఫిబ్రవరి లో బర్డ్ ఫ్లూ వ్యాప్తిని అరికట్టడానికి మూడు కోట్ల గుడ్లు పెట్టే కోళ్లను నిర్మూలించడంతో దేశ వ్యాప్తంగా కోడిగుడ్ల కొరతకు దారి తీసింది. ప్రస్తుతం బర్డ్ ఫ్లూ కేసులు తగ్గుముఖం పట్టడంతో టోకు ధరల సూచీ కాస్త నెమ్మదించినా గుడ్ల ధరలు ఇంకా అదుపులోకి రాలేదు.